Vijay Devarakonda : హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందు సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా ‘రెట్రో’ చిత్రం భారీ అంచనాలు ఏర్పడడానికి కారణం ఆ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి క్లిక్ అవ్వడం వల్లే. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్టర్ కావడంతో కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో ఏర్పాటు చేసాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
Also Read : భారత్ vs పాకిస్తాన్.. సైనిక శక్తి సమీక్ష..– ఎవరు బాహుబలి?
ఆయన మాట్లాడుతూ ‘సినిమా విడుదల సమయంలో డైరెక్టర్స్ ఆ చిత్రానికి సంబంధించి వేరే పనుల్లో బిజీ గా ఉంటూ ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి గైర్హాజరు అవుతూ ఉంటారు. ఈరోజు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కూడా అందుకే రాలేకపోయారు. కానీ రెట్రో ప్రొమోషన్స్ లో భాగం అయ్యినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. నేను పదవ తరగతి లో ఉన్నప్పుడు సూర్య గారి ‘గజినీ’ సినిమా విడుదలైంది. ఈ చిత్రం లో ఆయన నటన చూసి ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత సూర్య గారి పాత సినిమాలు చూడడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రం వ్యక్తిగతంగా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇందులో చంచల సాంగ్ ని ఇప్పటికీ షూటింగ్ గ్యాప్స్ లో చూస్తూనే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అగారం ఫౌండేషన్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘సూర్య అన్న ‘అగారం ఫౌండేషన్’ ఎంతో మంది పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. ఇది ఎంతో గొప్ప పని, నేను కూడా పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాల ద్వారా కాస్త డబ్బులు చూడగానే ఇలా పిల్లలకు చదువు చెప్పించాలని అనుకున్నాను. త్వరలోనే నేను కూడా ఫౌండేషన్ స్థాపిస్తాను. చదువు ప్రతీ ఒక్కరికి అవసరం, ఈరోజు నేను నా జీవితం లో ఇన్ని ఎత్తుపల్లాలను చూస్తూ బలంగా నిలబడ్డానంటే అందుకు కారణం నేను నేర్చుకున్న విద్య. చిన్నతనం లో చదువు మనకి అన్ని నేర్పిస్తుంది. మొన్న కాశ్మీర్ లో విద్వంసం చేసిన ఆ కొడుకులకు కూడా చదువు ఉండుంటే ఇలా జరిగేది కాదు. కాశ్మీర్ కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాశ్మీర్ మనది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.