Vijay Devarakonda : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ కోసం ఓవర్ బడ్జెట్ పెట్టి మరీ చేసిన రిస్క్ ప్రాజెక్టు ‘రొమాంటిక్’. అనిల్ పాదూరి అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై పూరితో పాటు ఛార్మి కూడా ఎక్కువ ఖర్చు పెట్టింది. ఇప్పుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే గానీ, పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

సినిమాకి ఎట్టిపరిస్థితుల్లో భారీ కలెక్షన్స్ ను రాబట్టుకునేలా మేకర్స్ భారీ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ దేవరకొండను తీసుకొచ్చారు. ఇక విజయ్ దేవరకొండ చేత ఆకాష్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పించారు. పనిలో పనిగా సినిమా గురించి కూడా విజయ్ బిల్డప్ మాటలు చెప్పుకొచ్చాడు.

అయితే, విజయ్ స్పీచ్ లో నిజాలు కంటే.. మాటవరసకు సాగిన స్పీచే ఎక్కువ ఉంది. ఆకాష్ మాటలు విన్నాక విజయ్ కి ఆకాష్ లో మంచి ఫైర్ ఉందనిపించిందట. మరి ఫైర్ వచ్చేలా ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. ఆకాష్ సినిమా పిచ్చి గురించి కూడా గొప్పగా విన్నట్టు విజయ్ చెప్పుకొచ్చాడు. మరి ఆ గొప్పగా ఏమి విన్నాడో క్లారిటీగా చెప్పలేదు.
ఇక చివరగా సినిమాపై పిచ్చి ఉన్న నీలాంటోళ్లు తప్పకుండా సక్సెస్ అవ్వాలి అంటూ ఆకాష్ ను ఉద్దేశించి విజయ్ దేవరకొండ మాట్లాడాడు. అలాగే భరోసా కూడా ఇస్తూ తప్పకుండా సక్సెస్ అవుతావు అని దైర్యం చెప్పాడు. ఇక ఈ ‘రొమాంటిక్’ సినిమా బాగా వచ్చిందని చూసినవాళ్లు చెప్పారట. అయినా ఎవరో చెప్పారని, ఈ సినిమా 100శాతం హిట్ అవుతుందని విజయ్ దేవరకొండ ఎలా చెబుతాడు ?
సినిమా చూసి తన అభిప్రాయం చెప్పాలి గాని, ఇలా ఏదేదో చెప్పిస్తే ఆడియన్స్ ఆ మాటలను నమ్మరు కదా. ఇక విధి విజయ్ దేవరకొండను, పూరి జగన్నాథ్ ను, చార్మీలను కలిపిందట. ఈ ముక్క కూడా విజయే చెప్పుకొచ్చాడు. ‘లైగర్’ సినిమా గురించి చెబుతూ ఈ మాట చెప్పాడు.