https://oktelugu.com/

Vijay Devarakonda- Samantha: ఈ రోజు పూజ.. ఎల్లుండు ‘సమంత’తో రొమాన్స్ !

Vijay Devarakonda- Samantha: సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌ గా ‘సమంత’ నటిస్తుంది. అయితే, ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ నెల 23 నుంచి ఈ సినిమా కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ ‘మే’ ఫస్ట్ వీక్ వరకూ జరగనుంది. మొదటి షెడ్యూల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 21, 2022 / 01:47 PM IST
    Follow us on

    Vijay Devarakonda- Samantha: సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌ లో రాబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌ గా ‘సమంత’ నటిస్తుంది. అయితే, ఈ రోజు హైదరాబాద్ లో ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమం జరిగింది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ నెల 23 నుంచి ఈ సినిమా కాశ్మీర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. మొదటి షెడ్యూల్ ‘మే’ ఫస్ట్ వీక్ వరకూ జరగనుంది.

    Vijay Devarakonda- Samantha

    మొదటి షెడ్యూల్ లో విజయ్‌ దేవరకొండ – సమంత పై రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో సామ్ – విజయ్ మధ్య రొమాన్స్ కూడా ఘాటుగానే ఉంటుందట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సామ్ ఈ సినిమాలో చాలా బోల్డ్ గా నటించడానికి అంగీకరించింది. మొత్తానికి సమంత వరుస సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది.

    Also Read: Star Directors: ఒక్క ఛాన్స్ తో వందల కోట్లు కొల్లగొట్టింది వీళ్ళే !

    ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా సామ్ మరో సినిమా చేస్తుండేసరికి మొత్తానికి మళ్ళీ సామ్ ఫామ్ లోకి వస్తోంది అని ఆమె ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. పైగా సామ్ – విజయ్ దేవరకొండ గతంలో మహానటిలో కూడా కలిసి జోడీగా నటించారు. అయితే, ఇప్పటి సినిమాకి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్‌ స్టోరీ ఇది.

    Vijay Devarakonda- Samantha

    ఎలాగూ రొమాంటిక్ లవ్‌ స్టోరీ కాబట్టి.. సామ్ – విజయ్ మధ్య కూడా ఓ రేంజ్ రొమాన్స్ ఉంటుంది. అందుకే, సమంత ఈ సినిమాకి మూడు కోట్లు డిమాండ్ చేసింది. ప్రస్తుతం సమంత మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’లో కూడా నటిస్తోంది. అలాగే యశోద సినిమాతో పాటు ఓ హాలీవుడ్‌ సినిమా కూడా చేస్తోంది.

    అయితే, సామ్, ఎన్ని సినిమాలు చేస్తున్నా తన కెరీర్ లోనే విజయ్ దేవరకొండ సినిమాను స్పెషల్ ఫిల్మ్ గా ట్రీట్ చేస్తోంది. కారణం ఆమెకు కథ బాగా నచ్చిందట. మరి విజయ్ దేవరకొండ – సామ్ కలయికలో ఈ చిత్రం ఏ స్థాయి హిట్ కొడుతుందో చూడాలి. అన్నట్టు ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో సమంత హాజరు కాలేదు. సామ్ మీడియా ముందుకు రావడానికి కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుందట.

    Also Read:Naga Chaitanya Samantha:నాగ చైతన్య ని మర్చిపోలేకపోతున్న సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

    Recommended Videos:

    Tags