Liger Collections: పూరి – విజయ్ దేవరకొండ లైగర్ రిలీజ్ కి ముందు భారీ అంచనాలున్నాయి. అయితే, రిలీజ్ తర్వాత వచ్చిన రిపోర్ట్స్ దెబ్బకు ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. కానీ ఒక్క చోట తప్ప. నష్టాల వలయంలో ఈ సినిమా పూర్తిగా చిక్కుకున్నా.. అక్కడ మాత్రం భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. భారీ డిజాస్టర్ సినిమాకి కూడా అక్కడ భారీ కలెక్షన్స్ వస్తున్నాయి అంటే.. అది విజయ్ దేవరకొండ గొప్పతనమే. ఇంతకీ అక్కడ అంటే.. అది ఎక్కడ ?, ఏ ఏరియాలో ఈ చిత్రం లాభాల దిశగా వెళ్తుందో తెలుసుకుందాం రండి.

మహబూబ్ నగర్ లోని ఏవిడీ మల్టీప్లెక్స్ లో లైగర్ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది. 10వ రోజు కూడా ఈ చిత్రం.. ఆ ఒక్క మల్టీప్లెక్స్ లోనే 4 లక్షలు రాబట్టింది. ఆ ఏరియా థియేటర్స్ రైట్స్ ను విజయ్ దేవరకొండ ఉంచుకున్నాడు. పైగా ఈ ఏవిడీ మల్టీప్లెక్స్ కూడా విజయ్ దే. మొత్తానికి ఇక్కడ మాత్రం విజయ్ కి భారీ ;లాభాలు దక్కాయి.
ఇంతకీ ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు గిట్టుబాటు అయ్యింది ?, ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ అయినా వచ్చాయా ? రాలేదా ? చూద్దాం రండి. ముందుగా ఈ సినిమా 10 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 5.74 కోట్లు
సీడెడ్ 1.86 కోట్లు
ఉత్తరాంధ్ర 1.78 కోట్లు
ఈస్ట్ 0.88 కోట్లు
వెస్ట్ 0.57 కోట్లు
గుంటూరు 0.99 కోట్లు
కృష్ణా 0.72 కోట్లు
నెల్లూరు 0.55 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 10 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 13.09 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 26.18 కోట్లు వచ్చాయి.

తమిళనాడు 0.34 కోట్లు
కేరళ 0.30 కోట్లు
కర్ణాటక 0.99 కోట్లు
హిందీ 8.25 కోట్లు
ఓవర్సీస్ 3.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 డేస్ కలెక్షన్స్ కు గానూ లైగర్ రూ. 26.38 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 54:77 కోట్లను కొల్లగొట్టింది
లైగర్ చిత్రానికి తెలుగు థియేట్రికల్ బిజినెస్ 55 కోట్లు జరిగింది. కానీ, 10 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఇప్పుడున్న బాక్సాఫీస్ లెక్కలను బట్టి నష్టాలను అంచనా వేస్తే.. ఈ సినిమాకి 34 కోట్ల వరకు భారీ నష్టాలు రానున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుని ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఆలోచించు విజయ్.
[…] […]