Vijay Devarakonda- Rashmika Mandanna: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే యూత్ ని ప్రభావితం చేసే భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా తరగని క్రేజ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారానే నెట్టుకొచ్చిన ఆయన ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరో గా మారి మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.
ఆ సినిమా తర్వాత వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ్ దేవరకొండ రేంజ్ ని ఎవ్వరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్లింది. యూత్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ చిత్రం అయితే స్టార్ హీరో రేంజ్ లో దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్ లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా, ఆ క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు.
ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ కి లేడీస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు, ముఖ్యంగా హీరోయిన్స్ అయితే విజయ్ దేవరకొండ ని చూసి మెంటలెక్కిపోతుంటారు. మీ క్రష్ ఎవరు అని ఏ హీరోయిన్ ని అడిగినా విజయ్ దేవరకొండ పేరుని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు. బాలీవుడ్ హీరోయిన్స్ దగ్గర నుండి టాలీవుడ్ హీరోయిన్స్ వరకు ప్రతీ ఒక్క హీరోయిన్ విజయ్ దేవరకొండ తో పులిహోర కలపాలని చూసేవాళ్ళే. ఆడవాళ్ళలో మనోడికి ఉన్న క్రేజ్ ని చూసి కుర్రాళ్ళు తెగ అసూయపడిపోతుంటారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక మందన తో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియా లో రూమర్స్ వినిపిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే.
అయితే నిన్న ఆయన తమ్ముడు ‘బేబీ’ మూవీ ప్రీమియర్ షో కి ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా తో కలిసి రావడం, వీళ్లిద్దరు థియేటర్ మొత్తం చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఒక పక్క రష్మిక తో ప్రేమాయణం నడుపుతూనే మరో పక్క రాశి ఖన్నా ని కూడా లైన్ లో పెట్టావా అన్నా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.