Vijay Devarakonda: ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ ముంబైలో జరుగుతుంది. ఇక ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో కలిసి నటించి ఆన్‌స్క్రీన్ లో సూపర్ పెయిర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. రష్మిక కూడా ఇటీవలే ‘పుష్ప’ సినిమాతో శ్రీవల్లిగా అలరించింది. వీరిద్దరూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని అందరికి తెలుసు. బయట ఈ జంట ఎక్కడ కనిపించినా కెమెరాలకు పనిచెప్తున్నారు మీడియా వారు. ఇక తాజగా ఈ రౌడీ జంట ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. గతంలో కూడా ఇద్దరూ కలిసి బయటకి వెళ్లి పార్టీలు చేసుకున్నారు. నిన్న సాయంత్రం ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ డిన్నర్‌కు వెళ్లారు.

దాంతో అక్కడ ఉన్న కొంతమంది వీరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలారోజుల తర్వాత విజయ్-రష్మిక కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందపడిపోతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా రావాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ జంట టైం దొరికినప్పుడల్లా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. వీరి గురించి ఎవరైనా అడిగితే మేము మంచి ఫ్రెండ్స్ అంటూ సింపుల్ గా చెప్పేసి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. రష్మిక సైతం పుష్ప తరువాత తాను ఒప్పుకున్నా బాలీవుడ్ సినిమాల కోసం ముంబైలో మకాం వేయడానికి సిద్దమయ్యింది.
