Vijay Devarakonda Rashmika Engagement: చాలా కాలం నుండి సోషల్ మీడియా లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) లవ్ స్టోరీ గురించి, వాళ్ళిద్దరి లివింగ్ రిలేషన్ షిప్ గురించి మనం వింటూనే ఉన్నాం. ఇది కేవలం రూమర్ మాత్రమే అని చాలా మంది కొట్టిపారేశారు. కానీ ఇది రూమర్ కాదని, నిజమేనని పలు సందర్భాల్లో రష్మిక అనధికారికంగా అభిమానులకు సిగ్నల్స్ కూడా ఇచ్చింది. ఈ వార్త బయటకు వచ్చిన కొత్తల్లో విజయ్ దేవరకొండ సిల్లీ రూమర్స్ అంటూ తన సోషల్ మీడియా ద్వారా తెలిపేవాడు. కారణం ఏమిటో తెలియదు కానీ, రష్మిక తో రిలేషన్ ని చాలా సీక్రెట్ గా మైంటైన్ చేసే ప్రయత్నం చేసాడు. వీళ్లిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని, విదేశాల్లో వీళ్లిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని గతంలో వార్తలు వినిపించాయి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది నిజమే కానీ, రహస్యం గా విదేశాల్లో నిశ్చితార్థం చేసుకున్నాడు అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు.
నిన్న హైదరాబాద్ లో అధికారికంగా ఆయన తన నివాసం లో బంధు మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్ష్యం లో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు కానీ, ఎలక్ట్రానిక్ మీడియాకి సమాచారం అయితే వెళ్ళిపోయింది. ఈ క్యూట్ జంట నిశ్చితార్ధ వేడుక ఫోటోల కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కనీసం ఈ విషయాన్నీ అయినా విజయ్ దేవరకొండ దాచకుండా తన సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పెళ్లి విషయానికి వస్తే ఈ ఏడాది చివర్లో గ్రాండ్ గా చేసుకోవాలని చూస్తున్నారు. ఇరు కుటుంబాలకు డిసెంబర్ నెలలో వివాహం జరిపించడం సమ్మతం అట. స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా అత్యధిక శాతం గతంలో డిసెంబర్ నెలలోనే జరిగాయి. వీళ్లిద్దరి పెళ్లి కూడా అదే నెలలో జరగడం గమనార్హం.
ఇక కెరీర్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ ఇంకా ఫ్లాప్స్ లోనే కొనసాగుతున్నాడు. ఆయన చివరి సూపర్ హిట్ చిత్రం గీత గోవిందం. ఆ తర్వాత విడుదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. మధ్యలో టాక్సీ వాలా అనే చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది కానీ, ఓవరాల్ గా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇక భారీ అంచనాల నడుమ రీసెంట్ గా విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం కూడా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. మరోపక్క రష్మిక కెరీర్ ని చూసుకుంటే, ఆమె పట్టిందల్లా బంగారం లాగా మారిపోతున్నాయి. రీసెంట్ గానే కుబేర తో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇక బాలీవుడ్ లో అయితే వెయ్యి కోట్ల సినిమాలు ఈమె ఖాతాలో అలవోకగా వచ్చి చేరుతున్నాయి.