Vidyut Jammwal విలన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, ఆ తర్వాత బాలీవుడ్ లో హీరో గా మారి రెండు మూడు సూపర్ హిట్స్ ని కూడా అందుకున్న నటుడు విద్యుత్ జమ్మాల్. ఈయన మన టాలీవుడ్ లో కూడా అనేక సినిమాల్లో విలన్ గా నటించాడు. ఎన్టీఆర్ ఊసరవెల్లి సినిమా ద్వారా ఇతనికి మంచి పేరు కూడా వచ్చింది. రీసెంట్ గా ఇతను శివ కార్తికేయన్ హీరో గా నటించిన ‘మదరాసి’ చిత్రం లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే విద్యుత్ జమ్మాల్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్. ఇండియా లో ఇతనికి రేంజ్ లో వర్కౌట్స్ ఏ హీరో కూడా చేయలేడు. అంతే కాదు ఎన్నో ప్రాణాంతక ఫైట్స్ డూప్ లేకుండా చేసేవాడు. అందుకే ఇతనికి ఇండియా వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
రీసెంట్ గా ఇతను నగ్నంగా చెట్టు ఎక్కుతున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ కలరిపయట్టు సాధకుడిగా నేను ఏడాదికి ఒకసారి సహజ యోగ సాధన చేస్తుంటాను. ఈ ప్రక్రియ మన సహత్వానికి మన మనసుని మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ప్రకృతిలో మన అంతరాత్మని మమేకం అయ్యేలా చేస్తుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెటిజెన్స్ స్పందిస్తూ, నీకు ఇష్టమొచ్చింది చేసుకో, కానీ నువ్వు నగ్నంగా ఉన్న వీడియో మాకు ఎందుకు షేర్ చేస్తున్నావ్, అంత అదృష్టం మాకెందుకు, కనీసం శరీరానికి ఆకులు అయినా చుట్టుకోవాల్సింది కదా అంటూ మండిపడుతున్నారు. అంతే కాదు ఇలా నగ్నంగా ఇప్పటి వరకు ఏ ఇండియన్ నటుడు కనిపించలేదు, నువ్వు తప్ప అని కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూడండి.