HBD Venky: థియేటర్లో ఓ వైపు నవ్వులు పూయిస్తూనే.. మరోవైపుసెంటిమెంట్ ఎమోషన్స్‌ను పండించగల ఏకైకన హీరో విక్టరీ వెంకటేశ్. సినీ నేపథ్యం కుటుంబానికి చెందినవాడైనప్పటికీ.. సొంత కాళ్లపై నిలబడి తన టాలెంట్‌తో టాప్‌హీరోల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వ్యక్తి వెంకి. ఆయన అభిమానులు అందరూ ఆయన్ను ముద్దుగా వెంకీ మామ అని పిలుస్తుంటారు. ఇప్పటి వరకు తన కెరీర్లో 80 సినిమాలకు పైగా నటించి.. సూపర్ సక్సస్ రేట్‌తో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. ఇప్పటి స్టార్ కుర్ర హీరోలకు కూడా కంటెంట్ ఉన్న చిత్రాలు చేస్తూ.. గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ నిర్మాత రామానాయడు తనయుడిగా సినిమాలో తొలి అడుగులు వేసి.. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలి ఇలా అన్ని జోనర్లను టచ్ చేసి.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు వెంకి. ఈ రోజు వెంకీ మామ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌పై ఓ లుక్కేద్దాం.
1986 ఆగష్టు 14న కలియుగ పాండవులు సినిమాతో హీరోగా తెరపై మెరిసి.. తొలి సినిమాతోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డును దక్కించుకున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో 7 నంది అవార్డులతో పాటు 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. అంతకమంటే ముందే ప్రేమ్‌నగర్‌లో బాలనటుడిగా కనిపించి మెప్పించారు. ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బొబ్బిలి రాజా, ప్రేమ, చంటి, సుందరకాండ, ధర్మచక్రం, ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, గణేశ్, వసంతం, సంక్రాంతి, మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుంచి రీసెంట్గా వచ్చిన నారప్ప, దృశ్యం2 వరకు అన్నీ సినిమాల్లోను విభిన్న పాత్రలు, కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించడంలో వెంకి మామ ముందుంటారు.
కాగా, ఇటీవలే దృశ్యం సీక్వెల్‌గా తెరకెక్కిన దృశ్యం2 సినిమా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎఫ్3లో నటిస్తున్నారు వెంకి. అనిల్ రావిపుడి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌తో పాటు తమన్న, మెహరిన్ కూడా నటిస్తున్నారు. సునీల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Victory venkatesh birthday special story
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com