https://oktelugu.com/

ఆ యంగ్ డైరెక్టర్ కు మహేష్ చాన్స్?

భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన భీష్మ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి.. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. అయితే తాజాగా వెంకీ కుడుముల మహేష్ ని కలిసి ఓ కథ వినిపించారట. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 05:57 PM IST
    Follow us on


    భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాడు వెంకీ కుడుముల. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్ గా వచ్చిన భీష్మ చిత్రం మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టి.. నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. అయితే తాజాగా వెంకీ కుడుముల మహేష్ ని కలిసి ఓ కథ వినిపించారట. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పట్ల మహేష్ కూడా సానుకూలంగా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.

    Also Read: రజినీకాంత్ ఎన్టీఆర్ రికార్డ్ ను బద్దలుకొట్టగలడా..?

    కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. కాగా వెంకీ కుడుముల సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తన తరువాత సినిమాని ప్లాన్ చేశాడని గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ వార్తే రావడంతో ఈ సినిమా పై అందరిలో నమ్మకం ఏర్పడింది. ఇక వెంకీ చెప్పిన లైన్ ఇంట్రస్టింగ్ గా ఉండటంతో మహేశ్ కూడా స్క్రిప్ట్ వర్క్ చేసుకోని ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

    Also Read: అభిజిత్ ను ఇంటి నుంచి పంపించేసిన బిగ్ బాస్?

    అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం వెంకీ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసాడని ఫుల్ స్క్రిప్ట్ ను మహేష్ కి చెప్పాడని.. మహేష్ కూడా దాదాపు సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. కాగా సినిమా మొత్తం పక్కా పల్లెటూరి నేపథ్యంలో ఉంటుందని.. ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎనభై నాటి కాలంలో జరుగుతుందని.. ముఖ్యంగా మహేష్ క్యారెక్టర్ ను వెంకీ చాలా బాగా రాశాడని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్