Unstoppable 4 : సీనియర్ హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి?..నిన్నటి తరంలో స్టార్ హీరోలుగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు ఇన్ని దశాబ్దాలలో బాక్స్ ఆఫీస్ వద్ద పోట్ల గిత్తలు లాగా పోరాడారు కానీ, ఒక్కసారి కూడా వీళ్ళు కలిసి మల్టీస్టార్రర్ చిత్రాలు చెయ్యలేదు. అప్పట్లో వాతావరణం అలా ఉండబట్టి కుదర్లేదు కానీ, ఇప్పుడు మాత్రం వీళ్ళ కాంబినేషన్ లో మల్టీస్టార్రర్ చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ, అల్లు అరవింద్ పుణ్యమా అని బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ద్వారా మనం ఎన్నో కాంబినేషన్స్ ని చూస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మూడు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షో, ప్రస్తుతం నాల్గవ సీజన్ ని జరుపుకుంటుంది. లేటెస్ట్ ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా విక్టరీ వెంకటేష్ వచ్చాడు.
ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసింది ఆహా టీం. ఈ ప్రోమో లో బాలయ్య బాబు, వెంకటేష్ కలిసి జరుపుకున్న సరదా చిట్ చాట్ బాగా వైరల్ అయ్యింది. ఈ సంక్రాంతికి బాలకృష్ణ నటించిన ‘దాకు మహారాజ్’, వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్న సంగతి తెలిసిందే. ఆ పోటీని ఉద్దేశిస్తూ బాలయ్య వెంకటేష్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇప్పుడు మన ఇద్దరం పోటీ పడాలా’ అని చాలా అమాయకంగా అడుగుతాడు. ‘మీరు నాకు నాకు పోటీనా’ అంటూ వెంకటేష్ ఫన్నీ గా మాట్లాడుతాడు. అలా వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతుండగా LED స్క్రీన్ లో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఫోటో ప్లే అవుతుంది. దానికి బాలయ్య సమాధానం ఇస్తూ ‘ఇండస్ట్రీ కి నాలుగు స్తంబాలు..ది రియల్ ఓజీస్’ అని అంటాడు.
వీరిలో బాలయ్య తనని తానూ గుడ్ బాయ్ అని చెప్పుకునే ప్రయత్నం చేయగా, వెంకటేష్ ‘ఏందీ నువ్వు గుడ్ బాయ్ వా’ అని నవ్వుతూ అంటాడు. ఇక ఆ తర్వాత వెంకటేష్ డైలాగ్ ని బాలయ్య కొట్టడం, బాలయ్య డైలాగ్ ని వెంకటేష్ కొట్టడం, వెంకటేష్ మ్యానరిజం ని బాలయ్య అనుకరించడం, బాలయ్య తొడగొట్టే స్టైల్ ని వెంకటేష్ అనుకరించడం వంటివి జరిగింది. ఇక ఆ తర్వాత వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు వస్తాడు. బాలయ్య అతన్ని చూడగానే ‘ఇంత అందం గా ఉన్నావు..హీరో గా రాకుండా నిర్మాత ఎందుకు అయ్యావు..?, అంటే తమ్ముడి కోసం కెరీర్ ని త్యాగం చేసావా?’ అని అడుగుతాడు. అప్పుడు వెంకటేష్ చెన్నై లో అందరూ మా అన్నని కమల్ హాసన్ లాగా ఉండేవాడు అనే వాళ్ళు అని అంటాడు. ఇక ఆ తర్వాత తమ తండ్రి రామానాయుడు ని గుర్తు తెచ్చుకొని వెంకటేష్, సురేష్ బాబు ఎమోషనల్ అవుతారు. అలా కాస్త సరదాగా, కాస్త ఎమోషనల్ గా సాగిన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీరు కూడా చూసేయండి.