Venkatesh Adarsha Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు . సాధారణంగానే త్రివిక్రమ్ చిత్రం పై అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి , అలాంటిది పీక్ ఫార్మ్ లో వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో తో చేతులు కలిపితే ఆ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ఊహించుకోవచ్చు. ఈ సినిమాకు కూడా మార్కెట్ లో పాన్ ఇండియన్ స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది , ఈ ఏడాది లోనే షూటింగ్ పూర్తి చేసి విడుదల చెయ్యాలని చూస్తున్నారు కానీ , అది జరిగేలా లేదు , సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ముందుగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు , కానీ అతను అనుకున్న సమయానికి ఔట్పుట్ డెలివరీ చేయలేకపోతుండడం తో , అతన్ని ఈ చిత్రం నుండి తప్పించి తమన్ ని తీసుకున్నారు. తమన్ మ్యూజిక్ కి యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ సినిమాలో తమన్ వెంకటేష్ పాత సినిమాల్లో సూపర్ హిట్ గా నిల్చిన ఒక పాటని రీమిక్స్ చేయబోతున్నాడట. అది ఏ పాటని రీమిక్స్ చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. నేటి తరం యూత్ ఆడియన్స్ ఉర్రూతలూ ఊగిపోయేలా , పాత సాంగ్స్ ని తన మార్క్ బీట్స్ తో అప్డేట్ చేసి కంపోజ్ చేయడం లో తమన్ ని మించిన వాళ్ళు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు.
కాబట్టి ఈ రీమిక్స్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలుస్తుందని , థియేటర్స్ లో ఈ పాటని చూసి ఆడియన్స్ ఊగిపోతారని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఆ రేంజ్ లో ఈ పాట ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రం లో యంగ్ హీరో నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా అంటే , కామెడీ , సెంటిమెంట్, పదునైన డైలాగ్స్ , ఇవన్నీ ఊహిస్తాము, కానీ ఈ చిత్రం లో అవన్నీ ఉంటూనే , మరో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కూడా చేర్చాడట త్రివిక్రమ్ శ్రీనివాస్ , మరి ఆ ఎలిమెంట్ ఏమిటి అనేది తెలియాలంటే టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.