https://oktelugu.com/

Sankranthiki Vasthunnam : వెంకీ డైరెక్టర్ అదరగొట్టేస్తున్నాడు, ఆ విషయంలో చరణ్, బాలయ్య డైరెక్టర్స్ చాలా వీక్

మొదటి సాంగ్ 'గోదారి గట్టు మీద రామ చిలకవే' కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ పాడించడానికి ముందు అనిల్ రావిపూడి ఓ వీడియో చేశారు. మనకు డిఫరెంట్ వాయిస్ కలిగిన మంచి సింగర్ కావాలంటూ

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2024 / 06:31 PM IST
    Follow us on

    Sankranthiki Vasthunnam : యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతి వస్తున్నాం మూవీ జనవరి 14న విడుదల కానుంది. అంటే మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కాగా సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి పోటీగా వస్తున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ఓ విషయంలో వెనుకబడ్డాయి. అనిల్ రావిపూడి వారిపై పైచేయి సాధిస్తున్నాడు. విడుదలకు ముందే ఎలా..

    హీరో ఎవరైనా కానీ.. ఓ చిత్రానికి పబ్లిసిటీ చాలా అవసరం. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లకపోతే సూపర్ స్టార్ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావు. చాలా సందర్భాల్లో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. ఇటీవల రజినీకాంత్ నటించిన వేట్టయన్ ఒక మంచి ఉదాహరణ. టాక్ తో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ చిత్రానికి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ వేట్టయన్ చిత్రానికి ఫస్ట్ డే వసూళ్లు దారుణంగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం… సినిమాకు ప్రచారం కల్పించకపోవడం.

    అసలు రజినీకాంత్ మూవీ విడుదల పై మాస్ ఆడియన్స్ కి ఆవాహన లేదు. అది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపింది. సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో మొత్తంగా పడిపోయింది. కాబట్టి సినిమాను మంచిగా తీయడం ఎంత ముఖ్యమో.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళి దిట్ట. ఆయన మార్కెటింగ్ ఎక్స్పర్ట్. కాగా అనిల్ రావిపూడి కూడా వినూత్నంగా ప్రయత్నం చేస్తూ తన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి పబ్లిసిటీ తెస్తున్నారు.

    మొదటి సాంగ్ ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్ పాడించడానికి ముందు అనిల్ రావిపూడి ఓ వీడియో చేశారు. మనకు డిఫరెంట్ వాయిస్ కలిగిన మంచి సింగర్ కావాలంటూ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టీమ్ తో డిస్కస్ చేయడం, వాళ్ళ మదిలో రమణ గోగుల పేరు మెదలడం.. ఆ వీడియోలో చూపించారు. రమణ గోగులు, హరిప్రియ పాడిన గోదారి గట్టుమీద.. సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. రికార్డు వ్యూస్ రాబట్టింది.

    కాగా మూడో పాట కోసం అనిల్ రావిపూడి మరో ప్రమోషనల్ వీడియో చేశాడు. ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ సింగర్ తో రెండో సాంగ్ పాడించాలని అనిల్ రావిపూడి తన టీమ్ తో చెబుతుండగా.. వెంకీ వచ్చి నేను పాడతా అంటాడు. నేనే పాడతా అంటూ.. అస్తమానం విసిగిస్తూ ఉంటాడు. చేసేది లేక భీమ్ సిసిరోలియోకి ఫోన్ చేసి వెంకటేష్ తో పాడించెయ్ అంటారు, అనిల్ రావిపూడి. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. సినిమాకు ప్రచారం తెచ్చిపెడుతుంది.

    ఈ తరహా ప్రమోషన్స్ బాబీ, శంకర్ చేయకపోవచ్చు. ఇలానే ప్రమోట్ చేయాలని లేదు. అయితే వినూత్నంగా ప్రయత్నం చేస్తే సక్సెస్ దక్కుతుంది. ఆ విషయంలో శంకర్, బాబీల కంటే చాలా ముందున్నాడు అనిల్ రావిపూడి.