Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల పెళ్లికొడుకుగా మారిన విషయం తెలిసిందే. తోటి నటి లావణ్య త్రిపాఠిని ఆయన ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించుకున్నారు. కొన్ని రోజుల పాటు ప్రేమించుకున్న వరుణ్, లావణ్యలు ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లిపై పెద్దగా ఆడంబరం లేకుండా అతికొద్ది మంది సమక్షంలోనే నిర్వహించుకోవడం విశేషం. ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నితిన్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే తాజాగా మరోసారి నాగబాబు ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీపావళి వేడుకలు సినీ సెలబ్రెటీల ఇళ్లల్లో వెలుగులు నింపాయి. ఈ సారి చిత్ర పరిశ్రమకు చెందిన వారు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనువరాలు వచ్చిన సందర్భంగా తొలి దీపావళిని ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మంచు లక్ష్మీ పేద పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేసి వారితో సరదాగా గడిపారు.
వీరితో పాటు మెగా హీరో నాగబాబు కుటుంబం సైతం తమ ఇంట్లో శుభకార్యం జరిగిన తరువాత తొలి దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నాగబాబు దంపతులతో పాటు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక ఉన్నారు. ఐదుగురు కుటుంబ సభ్యలు క్రాకర్స్ కాలుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే దీపావళి సందర్భంగా సాధారణంగా కొత్త కోడళ్లు తల్లిగారింట్లో గడపాలనుకుంటారు. కానీ లావణ్య మాత్రం అత్తారింట్లో ఎంతో సంతోషంగా కనిపించింది.
వీరికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో వరుణ్ దంపతులు రిచ్ గా కనిపించారు. సాంప్రదాయ దుస్తుల్లో వారు మెరిశారు. పెళ్ల తంతపు పూర్తయిన తరువాత పర్సనల్ గా వీరు కలిసి దిగిన ఫొటోల్లో ఎంతో అందంగా కనిపించారు. ఈ సందర్భంగా ఈ పిక్స్ పై ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram