Varun Tej- Allu Arjun: వరుణ్ తేజ్ ‘గని’ బన్నీకి బాగా నచ్చిందట

Varun Tej- Allu Arjun:  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్.. డైరెక్టర్, హీరోని పొగడ్తలతో ముంచెత్తారట. బన్నీ మాట్లాడుతూ.. […]

Written By: Shiva, Updated On : April 1, 2022 6:41 pm
Follow us on

Varun Tej- Allu Arjun:  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రిస్క్ చేసి మరీ బాక్సింగ్ నేపథ్యంలో చేస్తోన్న సినిమా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ బాక్సర్‌ గా కనిపించనుండగా.. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ రిలీజ్‌కి ముందే పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్.. డైరెక్టర్, హీరోని పొగడ్తలతో ముంచెత్తారట.

Varun Tej Ghani

బన్నీ మాట్లాడుతూ.. ‘వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించిన వరుణ్ నటన చాలా గొప్పగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ డీల్ జరిగింది. సుమారు రూ.25 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన గని ట్రైలర్ కు చక్కని రెస్పాన్స్ వస్తోంది.

Also Read: Janasena Party Protest : ‘పవర్ స్టార్’.. ‘పవర్’ చూపిస్తున్నాడుగా!

ట్రైలర్ లో నా పంచ్‌ పవర్‌ చూసి ఏదైనా నమ్మేయాల్సిందే అంటున్నాడు వరణ్‌. ట్రైలర్ పవర్‌ ఫుల్‌ గా ఉంది. వరుణ్‌ పంచ్‌ కొడితే లారీ టైర్లు ఎగిరిపడే షాట్స్‌, కారు అమాంతం కదిలిపోయే షాట్స్‌ బాగున్నాయి. అన్నట్టు ఈ సినిమా నుంచి ఆ మధ్య షార్ట్ గ్లింప్స్ అనే పేరుతో చిన్నపాటి ట్రైలర్ ను వదిలారు. అది కూడా చాలా బాగుంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాడు. బాక్సింగ్ కోట్ లో కండలు తిరిగిన దేహంతో అటు తిరిగి కనిపించిన వరుణ్ తేజ్ మొత్తానికి తన సిక్స్ ప్యాక్ బాడీతో సినిమా పై అంచనాలను పెంచాడు. అయితే ఈ సినిమాలో బాక్సర్‌ పాత్రలో నటించడానికి వరుణ్‌ తేజ్‌ కఠినమైన కసరత్తులు చేయాల్సి వచ్చింది. వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పైగా కెరీర్ లో మొదటి సారి సిక్స్ ప్యాక్ లో షర్ట్ లేకుండా నటిస్తున్నాడు.

Allu Arjun

అన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ గతంలో ‘బాలు’ అనే సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’నే. ఇప్పుడు వరుణ్ తేజ్, పవన్ సినిమా పేరును తన సినిమాకి టైటిల్ గా పెట్టుకోవడం విశేషం. వరుణ్ తేజ్ కి పవన్ పేర్లను వాడుకోవడం సెంటిమెంట్ అయిపోయింది. పవన్ సినిమా ‘తొలిప్రేమ’ టైటిల్ తోనే ఒక సినిమా చేసి వరుణ్ తేజ్ హిట్ కూడా కొట్టాడు. మరి ఇప్పుడు కూడా గనితో హిట్ కొడతాడేమో చూడాలి.

Also Read: Regional Ring Road: ఆర్ఆర్ఆర్ కు కేంద్రం సై: హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం

Tags