
ఇప్పుడంటే రామ్ గోపాల్ వర్మకి విలువ లేకుండా పోయింది గాని, ఒకప్పుడు ఆర్జీవీ అంటే ఎందరో ఫిల్మ్ మేకర్స్ కి ఆదర్శంగా నిలిచిన మేటి దర్శకుడు. తరం మారడం కారణంగానో, లేక వయసు పెరిగిన కారణంగానో వర్మలో క్రియేటివిటీ తగ్గింది. అయితే, వర్మ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూ పోతూ ఉంది. వర్మ యూట్యూబ్ వీడియోల కోసం నేటి జనరేషన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారట.
యూట్యూబ్ సూపర్ స్టార్స్ లో నెంబర్ వన్ స్టార్ వర్మనే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. వర్మ ఆ మధ్య డబ్బు చేసుకోవడానికి అనేక చిన్న చిత్రాలను తీయడం, వాటికీ తనదైన శైలిలో పబ్లిసిటీ చేయడం బాగా అలవాటు అయిపోయింది. ఇందులో భాగంగానే వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు. పైగా వీటి వల్ల కూడా ఆదాయం వస్తోందని వర్మకు అర్ధం అయినట్టు ఉంది.
అందుకే ఇప్పుడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, వాటి ఆదాయం పై ఫుల్ ఫోకస్ పెట్టారనే కామెంట్ ఇండస్ట్రీలో సెటైర్ గా వినిపిస్తోంది. అన్నిటికీ మించి సోషల్ మీడియా జనాల్ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలి అనేది వర్మకు షాట్ తో పెట్టిన విద్య అయ్యే. అందుకే వర్మ యూట్యూబ్ వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
మొత్తానికి ఇండియన్ వెండితెరకు సరికొత్త షాట్స్ ను అలవాటు చేసిన ఆర్జీవీ.. చివరకు యూట్యూబ్ స్టార్ గా మిగిలిపోవడం బాధాకరమైన విషయం. అన్నట్టు జర్నలిస్టులకు వర్మ తనదైన శైలిలో ఇంటర్వ్యూలను ఎలా ప్లాన్ చెయ్యాలి, జనాల్ని ఎలా అట్రాక్ట్ చెయ్యాలి లాంటి పలు అంశాల పై కొన్ని సలహాలు ఇస్తున్నాడు.