Varanasi Title: తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి… ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో సినిమా యొక్క టైటిల్ రిలీజ్ చేస్తూ సినిమా థీమ్ ను పరిచయం చేస్తూ ఒక గ్లింప్స్ రూపంలో ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు… మొత్తానికైతే ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు. ప్రస్తుతం ఈ టైటిల్ ట్రెండింగ్ లో ఉంది. గతంలోనే రామభక్త హనుమ క్రియేషన్స్ అనే బ్యానర్ వాళ్ళు ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 2023వ సంవత్సరంలోనే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఇప్పుడు ఈ టైటిల్ మీద వివాదం చెలరేగుతోంది.
మా టైటిల్ని మా అనుమతి లేకుండా రాజమౌళి ఎలా వాడుకుంటాడు అంటూ నిర్మాతలా మండలి లో ఫిర్యాదు చేశారు. ఇక దీంతో రాజమౌళి ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాడనే చెప్పాలి. ఘనంగా టైటిల్ ఈవెంట్ ను కండక్ట్ చేసిన రాజమౌళి ఇప్పుడు నిర్మాత మండలి పెట్టే కండిషన్స్ కి ఒప్పుకొని టైటిల్ని తీసేస్తాడా? లేదంటే టైటిల్ ని మార్చే ప్రయత్నం ఏదైనా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే వారణాసి అనేది చాలా పవర్ ఫుల్ టైటిల్…అలాగే హిందూ దేవుళ్లకు సైతం వారణాసి తో కనెక్షన్ ఉండడంతో ఆ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడంతో రాజమౌళి కొంతవరకు డైలమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక తొందరలోనే ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవాలని రాజమౌళికి నిర్మాతల మండలి నుంచి ఒక నోటీస్ వెళ్ళింది.
మరి తను ఈ టైటిల్ని మారుస్తాడా లేదంటే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళ దగ్గర నుంచి టైటిల్ ని కొనుక్కుంటాడా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అయింది. కాబట్టి ఇప్పుడు టైటిల్ మారిస్తే సినిమాకి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాజమౌళి సాధ్యమైనంత వరకు ఈ టైటిల్ ని వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసి అఫీషియల్ గా ఇదే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది…