Rajamouli Family Remuneration: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాతో రాజమౌళి మరోసారి ప్రపంచ స్థాయి ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మహేష్ బాబు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ వారణాసి సినిమాతో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అక్కడి దర్శకులందర్నీ కూడా ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 1500 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజమౌళి వైవిద్య భరితమైన అంశాలను ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బీభత్సంగా ఉండబోతున్నాయట. కొన్ని గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ప్రతి ప్రేక్షకుడికి ఎగ్జైట్ మెంట్ కలుగుతుందని ఎలివేషన్స్ మామూలుగా ఉండవని కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబును రాజమౌళి ఏ రేంజ్ లో చూపిస్తాడు. ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. మరి మొత్తానికైతే రాజమౌళి మహేష్ బాబును పూర్తిస్థాయిలో వాడుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… వారణాసి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నాడు అనేది వాస్తవం.
రాజమౌళి ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఆయనది పక్కన పెడితే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి వీళ్ళందరికి కలిపి 200 కోట్ల వరకు ప్యాకేజీ అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది…
ఇక కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తే రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తుంది. కీరవాణి వాళ్ళ వైఫ్ వల్లి లైన్ ప్రొడ్యూసర్ గా, రాజమౌళి కొడుకు కార్తీకేయ సినిమా మొత్తాన్ని తనే దగ్గరుండి మరి షూటింగ్ పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటాడు. కీరవాణి తమ్ముడు అయిన కాంచి సైతం స్టోరీ లో రాజమౌళికి చాలా వరకు హెల్ప్ చేస్తుంటాడు.
ఇక రాజమౌళి వాళ్ళ ఫాదర్ అయిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథను అందించాడు. కీరవాణి చిన్న తమ్ముడు అయిన కళ్యాణ్ మాలిక్ సైతం ఈ సినిమా మ్యూజిక్ లో తను ఒక కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక ఇలా ఫ్యామిలీ మొత్తం సినిమాలో ఇన్వాల్వ్ ఇవ్వడం వల్ల వాళ్లందరికి కలిపి దాదాపు 200 కోట్ల వరకు ఒక ప్యాకేజీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాజమౌళి 250 కోట్లు ఫ్యామిలీ మొత్తానికి 200 కోట్లు అంటే వీళ్ళకే 450 కోట్ల వరకు అమౌంట్ వెళ్ళిపోతుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…
