Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ను సైతం రాజమౌళి చాలా గ్రాండ్ గా నిర్వహించాడు. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని టాప్ లెవెల్లో నిలిపే విధంగా క్రియేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఎడ్డింగ్ కల్లా పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతుంది. కాబట్టి పెను సంచలనాన్ని క్రియేట్ చేసే సినిమా అవుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి ఇప్పుడు చేయబోతున్న ఈ సినిమా కూడా పెను సంచలనాలను క్రియేట్ చేస్తుందనేది చాలా కన్ఫామ్ గా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం…
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను దాదాపు 1500 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. కాబట్టి ఈ సినిమా 3500 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబడుతుందనే అంచనాలో రాజమౌళి ఉన్నారట. ప్రస్తుతం అతను అనుకుంటున్నట్టు గానే అంత భారీ మొత్తంలో కలెక్షన్స్ వస్తాయా అనే ధోరణిలో కూడా కొంతమంది కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయిన కూడా 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడమే గగనం అవుతున్న కాలంలో 3500 కోట్ల మార్కును టచ్ చేయడం అనేది ఇంకా చాలావరకు ఇబ్బంది పెట్టే అంశంగా మారబోతుందేమో అనే రీతిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఈ సినిమాను చూసే విధంగా ఇందులో ఎలిమెంట్స్ ఉంటేనే ఈ సినిమాకి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు…

