Varanasi glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమాలోని కొన్ని కీలకమైన షాట్స్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ని ఒక గ్లింప్స్ వీడియో ద్వారా రామోజీ ఫిలిం సిటీ లో ‘#Globetrotter’ అనే ఈవెంట్ ని నిర్వహించి , గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో మహేష్ బాబు లుక్స్ ని , ఆయన ఎక్స్ ప్రెషన్స్ ని చూసి అభిమానులకు అప్పుడే అనుమానం వచ్చింది.
ఇవి నేచురల్ మహేష్ బాబు లుక్స్ , ఎక్స్ ప్రెషన్స్ లాగా లేవే, AI ద్వారా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు నెటిజెన్స్. వాళ్ళ అనుమానాలు నిజం అయ్యాయి, గ్లింప్స్ వీడియో లో మనం చూసిన మహేష్ బాబు నిజమైన మహేష్ బాబు కాదు , AI ద్వారా క్రియేట్ చేశారు. గ్లింప్స్ చివర్లో ఆయన ఎద్దు మీద స్వారీ చేస్తూ , చేతిలో సూలం పట్టుకున్న షాట్ ఉంది కదా, ఆ షాట్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే మొదలు పెట్టారు. సన్నివేశం నెంబర్ 76 , టేక్ 1 , బుల్ షాట్ – 410 A అని ఉన్నటువంటి క్లాప్ బోర్డు నిన్నటి నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మనం గ్లింప్స్ లో చూసిన షాట్ ఇప్పటి వరకు షూట్ చెయ్యలేదా ?, అసలు ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నాము అంటూ రాజమౌళి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసాడు. మరి ఆ సమయానికి సినిమా రెడీ గా ఉంటుందా? , ఇప్పటి వరకు రాజమౌళి చరిత్ర లో , చెప్పిన తేదికి సినిమాని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాకు కూడా అదే జరుగుతుందనే భయం అభిమానుల్లో ఉంది. కానీ రాజమౌళి మాత్రం సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఆ టార్గెట్ ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి.
