ఈ భారీ గ్లామర్ బ్యూటీ ఈ సారైనా.. !

సినీ పరిశ్రమలో మనకు అన్ని ఉన్నా.. అదృష్టం అనే ఒక్క ఐటమ్ లేకపోతే ఇక మనకు అవకాశాలు రావనేది సినీ ప్రపంచంలో వినిపించే రొటీన్ డైలాగ్. నిజానికి ఈ డైలాగ్ రొటీన్ అయినా.. కొంతమందిని చూస్తే ఈ మాట నిజమేనేమో అనిపిస్తోంది. ఆ కొంతమందిలోని వ్యక్తే బబ్లీ బ్యూటీ ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’. పైగా ఒక హీరోకి కూతురు. ఆ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా పక్కా భారీ గ్లామర్ బ్యూటీ. […]

Written By: admin, Updated On : June 10, 2020 7:08 pm
Follow us on


సినీ పరిశ్రమలో మనకు అన్ని ఉన్నా.. అదృష్టం అనే ఒక్క ఐటమ్ లేకపోతే ఇక మనకు అవకాశాలు రావనేది సినీ ప్రపంచంలో వినిపించే రొటీన్ డైలాగ్. నిజానికి ఈ డైలాగ్ రొటీన్ అయినా.. కొంతమందిని చూస్తే ఈ మాట నిజమేనేమో అనిపిస్తోంది. ఆ కొంతమందిలోని వ్యక్తే బబ్లీ బ్యూటీ ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’. పైగా ఒక హీరోకి కూతురు. ఆ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ కు ఉండాల్సిన క్యాలిటీస్ అన్ని ఉన్నా పక్కా భారీ గ్లామర్ బ్యూటీ. అయినా ఎందుకో హీరోయిన్ గా మాత్రం ఈ వెయిట్ బ్యూటీ బిజీ కాలేకపోతుంది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బలమైన సపోర్ట్ ఉన్నా.. ఇన్నాళ్లూ ఎక్కువుగా చిన్న చిత్రాలకు అలాగే సేడ్ క్యారెక్టర్స్ కే పరిమితం అవుతూ రావడం వరలక్ష్మి విషయంలో తీవ్ర అన్యాయమే. పోనీ ఆ సినిమాలైనా ఆ క్యారెక్టర్స్ అయినా, ప్రాముఖ్యత ఉన్నవా అంటే.. ఎదో చిన్న చితక చిత్రాల్లో ఏదో కాసేపు కనిపించే పక్కా ఆవేశపూరిత రెగ్యూలర్ క్యారెక్టర్స్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వరలక్ష్మికి మాస్‌ మహారాజా సినిమా క్రాక్ లో ఓ మంచి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే.

ర‌వితేజ – గోపీచంద్ మ‌లినేని కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. అయితే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కూడా రవితేజ సరసన మరో హీరోయిన్ గా ఆడిపాడనుందని, శ్రుతి హాసన్ పాత్రకు వరలక్ష్మీ పాత్ర కూడా దీటుగా ఉంటుందని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వరలక్ష్మి పాత్రనే హైలెట్ అవ్వనుందని తెలుస్తోంది.

మొత్తానికి లేడీ రౌడీ పాత్రలకే పరిమితం అవుతూ వస్తోన్న వరలక్ష్మికి హీరోయిన్ గా మంచి రోల్ రావడం విశేషమే. ఇక ఈ సినిమాలో ర‌వితేజ ప‌వ‌ర్‌ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ గా నటించనున్నాడు. బి.మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ‘వరలక్ష్మీ శరత్‌కుమార్‌’ ఈ చిత్రంతోనైనా రెగ్యులర్ హీరోయిన్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి.