Ananya Nagalla: ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఇతర భాష హీరోయిన్లదే ఆధిపత్యం ఉండేది. కాలక్రమంలో ఆ ధోరణిలో మార్పు వస్తోంది. మన భాష కథానాయికలకు కూడా అవకాశాలు వస్తున్నాయి. దీంతో వారు తమ నటనను ప్రదర్శిస్తూ ఆఫర్లు దక్కించుకుంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఉన్న పరిస్థితులకు బిన్నంగా ఇప్పుడు వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ నటనలో రాణిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్ల ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వరుస ఆఫర్లలో అనన్య నాగళ్ల తన ప్రతిభను ప్రదర్శిస్తోంది.

అనన్య షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. దీంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మల్లేశం సినిమాలో అవకాశం దక్కించుకుని తన నటనతో అందరిని మెప్పించింది. తరువాత వకీల్ సాబ్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. అందులో కూడా తన నటనతో అందరిని ఫిదా చేసింది. సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇందులో కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇందులో దివ్య నాయక్ పాత్రకు న్యాయం చేసింది.
Also Read: F3 – 2 Day Collections: ‘ఎఫ్ 3’ 2nd డే బాక్సాఫీస్ కలెక్షన్స్

ఈ అమ్మడు సినిమాల్లో బిజీగా ఉండటమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో తన పిక్ లు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఒంపు సొంపులతో అభిమానులను పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలు ప్రేక్షకులతో పంచుకుంటూ మురిసిపోతోంది. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయి తన అందాలకు ఫాలోవర్స్ ను సంపాదించుకుంటోంది. నిత్యం సోషల్ మీడియాలో తన ఫొటోలతో వైరల్ అవుతోంది. ప్లే బాక్ అసే సినిమాలో నటించింది. ఇంకా మాస్ట్రో సినిమాలో కూడా ఆమె పాత్ర పోషించడం చూస్తుంటే ఆమె ఇంకా తన అవకాశాలను దక్కించుకునేందుకు ఆరాటపడుతున్నట్లు తెలుస్లోంది.

అనన్య నటనతో వైవిధ్యమైన పాత్రలు చేస్తోంది. ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగు వారికి కూడా టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని అనన్య నిరూపిస్తోంది. నటనలో తనకు తానే సాటి అని చూపిస్తోంది. ఇందులో భాగంగానే సినిమాల్లో వరుసగా చాన్సులు కొట్టేస్తోంది. ఇన్నాళ్లుగా ఉన్న అపవాదును దూరం చేస్తూ మనకు కూడా ప్రతిభ ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని అనన్య చెబుతోంది. భవిష్యత్ లో మరిన్ని అవకాశాలు తెచ్చుకుని నటనతో రాణించాలని భావిస్తోంది. అనన్య నాగళ్ల వరుసు అవకాశాలు దక్కించుకుని మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Pawan Kalyan CM Candidate: సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్.. బీజేపీ రూట్ మ్యాప్ లో సంచలన విషయాలు