
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయనకు అభిమానులు కాదు.. భక్తులే ఉంటారనేది చాలా మంది మాట. అది నిజమే అన్నట్టుగా.. పవన్ పై తమ అభిమానం చూపుతుంటారు ఫ్యాన్స్. అలాంటి పవన్ మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు నిర్మాత దిల్ రాజు. అలా ఇలా కాదు.. కోటి రూపాయలు ఖర్చుచేసి, అద్దిరిపోయే లెవల్లో ఈవెంట్ నిర్వహణకు సిద్ధమయ్యారు. కానీ.. ఫ్యాన్స్ రావాలా? వద్దా? అన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య!
Also Read: ముసలోడితో ఇలియానా పెళ్లి !
దీనికి ప్రధాన కారణం కరోనా. సెకండ్ వేవ్ సూచనలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో పవన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయని నిర్వాహకులు ఆలోచనలో పడిపోయారు. పవన్ వేదికపైకి వస్తున్నాడంటేనే ఊగిపోయే ఫ్యాన్స్.. ఇదే వేదికపైకి మెగాస్టార్ తోపాటు మెగాపవర్ స్టార్ కూడా రాబోతున్నారు. ఇక ఫ్యాన్స్ పూనకాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవాల్సిందే.
ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం సాధ్యం కానేకాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాసులు జారీచేసి, అవి ఉన్నవారినే అనుమతించే ప్రయత్నం చేసినా.. కొవిడ్ నిబంధనలు పాటించే అవకాశం చాలా తక్కువ అన్నది వాదన. ఆ సమయంలో అభిమాన హీరోలను చూసిన ఫ్యాన్స్ కొవిడ్ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. ఈలలు, గోలలతో రచ్చ రచ్చ చేస్తారు.
Also Read: అరె..’బాలయ్య సినిమా’కి దూరం దూరం !
ఒకవేళ ఫ్యాన్స్ ను పిలవకుండా ఏదో వేదికపై ఫంక్షన్ ఏర్పాటు చేస్తే అది మరీ దారుణంగా ఉంటుంది. పవన్, చిరు, చరణ్ వచ్చిన ఫంక్షన్ ఫ్యాన్స్ హంగామా లేకుండా జరిగితే పెద్ద ప్రయోజనమే ఉండకపోవచ్చని అంటున్నారు. ఏదో ఓ కార్యక్రమం జరిగింది, ముగిసింది అన్న తీరులో ఉంటే.. కిక్కే ఉండదు. కాబట్టి, ఖచ్చితంగా ఫ్యాన్స్ మధ్యనే ఈ వేడుక జరగాలి. అప్పుడే సినిమా ప్రచారం హైప్ లోకి రావడంతోపాటు యూనిట్ కు జోష్ వస్తుంది.
మరి, ఇప్పుడు ఏం చేయాలన్నదే నిర్మాత దిల్ రాజుకు పాలుపోవట్లేదట. దీంతో.. ఫ్యాన్స్ ను పిలవాలా? వద్దా? అనే నిర్ణయం పవన్ కే వదిలేశాడట. పవన్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థంకాక సతమతం అవుతున్నాడట. చివరకు వకీల్ సాబ్ ఈవెంట్ ఫ్యాన్స్ వస్తున్నారా? లేదా? అన్నది తెలియల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్