Ustad Bhagat Singh Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు అతని అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులలో కూడా ఆ సినిమా మీద భారీ అంచనాలైతే పెరుగుతాయి…ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ఆయన ‘ఓజీ’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక దాంతో మరోసారి పవన్ కళ్యాణ్ లైమ్ లైట్ లోకి వచ్చాడనే చెప్పాలి. ఈ సంవత్సరం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమాను మొదట జూన్, జూలైలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం మార్చిలో రిలీజ్ అవ్వాల్సిన పెద్ది, ప్యారడైస్ సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాని మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో హరీష్ శంకర్ ఉన్నాడట…
ఇప్పటికే సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలని హరీష్ శంకర్ చూస్తున్నాడు. ఇక ఇంతకుముందు ఆయన చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా భారీ ఫ్లాప్ అవ్వడంతో ఆయన మార్కెట్ భారీగా పడిపోయింది.
కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఈ సినిమా ఎంతటి కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను రెట్టింపు చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం కొన్ని కొత్త సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అతనికి కమర్షియల్ సక్సెస్ ను కట్టబెడుతుందని అతను నమ్ముతున్నాడు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ కోసం పవన్ కళ్యాణ్ సైతం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది…