Ustaad Bhagat Singh Release Date: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నుండి ప్రస్తుతం విడుదలకు రెడీ గా ఉన్న ఏకైక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉన్న ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు హరి హర వీరమల్లు, ఓజహీ చిత్రాలను మధ్యలోనే ఆపేసాడు. కానీ విరామం తీసుకొని మళ్లీ ఈ సినిమాల షూటింగ్ సెట్స్ లోక్ అడుగుపెట్టి మూడు సినిమాలను పూర్తి చేసేసాడు. ఆ మూడిట్లో రెండు ఈ ఏడాది నే విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. హరి హర వీరమల్లు చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, ఓజీ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించి మొత్తం పూర్తి అయ్యింది. కేవలం ఆయన లేని సన్నివేశాలు మాత్రమే బ్యాలఞ్చ ఉన్నాయి.
Also Read: 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ మూవీస్ ప్లాప్ అవ్వడానికి కారణం ఎవరు..?
ఈ నెలాఖరు తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవ్వబోతోంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ గా ప్రొమోషన్స్ ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్., ఇదంతా పక్కన పెడితే ఈ చిత్ర నిర్మాత రవి శంకర్ నిన్న ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేయబోతున్నాము అనే విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ మూడవ వారం లో ఈ సినిమాని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఎందుకంటే వీళ్ళు నిర్మాతలు గా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రాన్ని మార్చ్ 27 న విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ సినిమా విడుదలైన మరుసటి నెలలోనే అదే కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ సినిమాని విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ రిస్కులు చేయడం, మైత్రీ మూవీ మేకర్స్ కి కొత్తేమి కాదు.,
Also Read: ఆర్మీ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు!
2023 వ సంవత్సరం లో వీళ్ళ బ్యానర్ లో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’,’వాల్తేరు వీరయ్య’ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలై రెండు కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అలా జరగడం మొదటిసారి. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేసి కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడానికి రెడీ అయిపోయారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘పెద్ది’ మాత్రమే కాకుండా #NTRNeel, ఆంధ్రా కింగ్ తాలూకా, ఫౌజీ చిత్రాలు ఉన్నాయి. ఈ 5 సినిమాలు కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతాయని, మేము చెప్పింది అబద్దం అయితే సినిమాలే ఆపేస్తాము అంటూ బలన ఛాలెంజ్ విసిరాడు. మరి ఈ ఛాలెంజ్ లో ఆయన నెగ్గుతాడా లేదా అనేది చూడాలి.
#UstaadBhagatSingh All Set To Release On April 2026 Confirmed By ✅✅
Producer Ravi Shankar #PawanKalyan #Sreeleela pic.twitter.com/LvDuioGkVf
— FilmUpdates36 (@Jaswanth_35679) November 20, 2025