Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh OTT: ఓటీటీ లోనూ దారుణమైన రెస్పాన్స్.. 'ఉస్తాద్ భగత్ సింగ్'...

Ustaad Bhagat Singh OTT: ఓటీటీ లోనూ దారుణమైన రెస్పాన్స్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఆగని ట్రోల్స్..

Ustaad Bhagat Singh OTT: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఆయన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించాయి , కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా అదే రేంజ్ ప్రభావం చూపించాయి. అలాంటి ఫ్లాప్స్ లో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). గతంలో ఆయన చేసిన ఫ్లాప్ సినిమాలు కనీసం ఒక్కసారి చూసేవిధంగా ఉండేవి. కానీ రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మాత్రం అభిమానులకు కూడా బోర్ కొట్టించింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ కళా ఖండం అనేది. మొదటి రోజే వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టే సత్తా ఉన్న పవన్ కళ్యాణ్, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో క్లోజింగ్ లో వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడానికి నానా తిప్పలు పడ్డాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు , హరీష్ శంకర్ తన దర్శకత్వ ప్రతిభ తో ఏ రేంజ్ రోత పుట్టించాడు అనేది.

రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్స్ లో ఎలాగో మంచి రెస్పాన్స్ రాలేదు , కనీసం నెట్ ఫ్లిక్స్ లో అయినా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందేమో అనే చిన్న ఆశ అభిమానుల్లో ఉండేది. కానీ ఇక్కడ కూడా ఈ చిత్రానికి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నెటిజెన్స్ ఈ సినిమా పై వేస్తున్న ట్రోల్స్ ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఏడవడం ఒక్కటే తక్కువ. ఒకటి రెండు ట్రోల్ స్టఫ్ సన్నివేశాలు ఉండడం సహజమే , కానీ ఈ సినిమాలో ఆరంభం నుండి చివరి వరకు ప్రతీ ఒక్కటి ట్రోల్ స్టఫ్ లాగానే ఉంది , ఒక సూపర్ స్టార్ తో ఇలాంటి నాసిరకమైన సినిమా తీయడం హరీష్ శంకర్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ‘ఓజీ’ చిత్రం విడుదలై 6 నెలలు కావొస్తుంది.

కానీ అభిమానులు , ప్రేక్షకులు ఇప్పటికీ ఆ చిత్రం లోని సన్నివేశాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ , వాటి గొప్పదనాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం నడుస్తున్నటువంటి IPL సీజన్ లో అయితే ఎక్కడ చూసినా ఓజీ మేనియా నే కనిపిస్తోంది. ఆ రేంజ్ కంటెంట్ ని ఆస్వాదించిన అభిమానులకు , కేవలం ఆరు నెలల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి నాసిరకపు ప్రోడక్ట్ ని కూడా చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా హరీష్ శంకర్ ని అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిట్టే తిట్లు మామూలు రేంజ్ లో లేవు. అయితే ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో మొదటి వారం ఎన్ని వ్యూస్ వస్తాయో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version