Ustaad Bhagat Singh overseas buyers: మన టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ గత రెండు దశాబ్దాల నుండి అతి పెద్ద మార్కెట్ గా కొనసాగుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కారణంగానే ఈ మార్కెట్ తారా స్థాయికి చేరుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత పెద్ద ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు సంక్షోభం లో పడింది. ఒకప్పుడు చిన్న హీరో సినిమాలకు, పెద్ద హీరో సినిమాలకు ఈ మార్కెట్ లో చాలా తేడా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి తేడా అసలు కనిపించడం లేదు. కంటెంట్ ఉంటేనే అక్కడి జనాలు కదులుతున్నారు. లేదంటే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా సరే, ప్రీమియర్ షోస్ పూర్తి అయిన వెంటనే అతి దారుణంగా తొక్కేస్తాం అంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు పెద్ద హీరోల సినిమాలకు ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చినా, వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చేవి.
కానీ గత ఏడాది నుండి సీన్ మొత్తం మారిపోయింది. ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం ప్రీమియర్స్ + మొదటి రోజు వచ్చే కలెక్షన్స్ మాత్రమే ఫైనల్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఉదాహరణకు గత ఏడాది విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu), ఈ సంక్రాంతికి విడుదలైన ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రాలను తీసుకుందాం. ‘హరి హర వీరమల్లు’ చిత్రం బాగా పాడుబడింది. ఆ కారణం చేత ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి తక్కువ గ్రాస్ వచ్చింది, మొదటి రోజే క్లోజ్ అయిపోయింది. ఇక భారీ రేట్ కి కొనుగోలు చేసిన ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రం పరిస్థితి కూడా ఇంతే, మొదటి రోజుకే క్లోజ్ అయిపోయింది. అందుకే రొటీన్ కమర్షియల్ సినిమాలను కొనుగోలు చేయడానికి ఓవర్సీస్ బయ్యర్స్ అసలు ఆసక్తి చూపడం లేదు. పధి కోట్ల రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇచ్చేందుకు ఇష్టం చూపడం లేదు.
వచ్చే నెల 26 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh) చిత్రాన్ని కొనుగోలు చేయడానికి అక్కడి బయ్యర్స్ అసలు ఆసక్తి చూపడం లేదు. పవన్ కళ్యాణ్ గత చిత్రం ‘ఓజీ’ కేవలం నార్త్ అమెరికా నుండి 5.6 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఓవర్సీస్ నుండి 8 మిలియన్ డాలర్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఆ రేంజ్ హిట్ తర్వాత రాబోతున్న సినిమా అయినప్పటికీ కూడా అక్కడి బయ్యర్స్ సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఇదొక మామూలు కమర్షియల్ సినిమా అవ్వడమే. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ కి కేవలం 10 కోట్లు మాత్రమే ఇస్తామని అంటున్నారు. అందుకు నిర్మాత అసలు ఒప్పుకోవడం లేదు. 15 కోట్ల రూపాయలకు అమ్మాలని చూస్తున్నారు. సినిమా విడుదలకు పట్టుమని 40 రోజులు కూడా లేదు, అయినప్పటికీ ఈ సినిమా ఇంకా అమ్ముడుపోకపోవడం ఆశ్చర్యానికి గురి చేసే విషయం. మేకర్స్ ప్రొమోషన్స్ మొదలు పెట్టి, సినిమాకు హైప్ ని తీసుకొస్తే తప్ప, ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ ముందుకు కదిలే అవకాశం కనిపించడం లేదు.