Site icon OkTelugu

Ustaad Bhagat Singh 17 Days Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 17 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. మరో 2 కోట్ల దూరంలో టార్గెట్..

Ustaad Bhagat Singh 17 Days Collections

Ustaad Bhagat Singh 17 Days Collections

Ustaad Bhagat Singh 17 Days Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా థియేట్రికల్ రన్ ని ముగించుకుని దిశగా అడుగులు వేస్తోంది. ‘ఓజీ’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆరంభం నుండి ఈ చిత్రం ‘తేరి’ రీమేక్ అంటూ ప్రచారం అవ్వడంతో పాటు, కమర్షియల్ ఫార్మటు సినిమాల కాలం పూర్తిగా చెల్లిపోవడం తో , ఈ చిత్రం ఇలాంటి ఫలితాన్ని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అభిమానులు కూడా ఈ చిత్రాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. పైగా ఈ చిత్రానికి పోటీగా ‘ధురంధర్ 2’ కూడా ఉండడం మరో పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇకపోతే 17 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత షేర్ వసూళ్లు వచ్చిందో చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 17 రోజుల్లో 16 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 6 కోట్ల 50 లక్షలు, తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 3 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా గుంటూరు నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , కృష్ణ జిల్లా నుండి 4 కోట్లు, నెల్లూరు జిల్లా నుండి 1 కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా చూస్తే , కర్ణాటక తో కలుపుకొని ఈ చిత్రానికి 3 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , ఓవర్సీస్ నుండి 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 58 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 98.5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోవడానికి ఇంకా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. మొదటి రోజే 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తదుపరి చిత్రానికి కనీసం క్లోజింగ్ లో కూడా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు రావడం లేదు, దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సిందేనండి ఎంతంటే అవుట్ డేటెడ్ సినిమాలు ఇక మీదట చెయ్యకూడదు. చేస్తే ఇలాంటి పరాభవాలు తప్పవని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Exit mobile version