https://oktelugu.com/

Krithi Shetty: టైట్ డ్రెస్ లో రెచ్చగొట్టే కృతి శెట్టి షేపులు… ఉప్పెన బ్యూటీ బోల్డ్ ఫోటో షూట్ వైరల్

మూవీ సక్సెస్ కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు ఆఫర్స్ వరుస కట్టాయి. హీరోయిన్ గా రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇక బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2023 / 10:02 AM IST

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. ఆమె టాలీవుడ్ లో ఆమె ఎంత వేగంగా ఎదిగిందో అంతే వేగంగా పడిపోయింది. దర్శకుడు సానా బుచ్చిబాబు కృతి శెట్టికి ఉప్పెన మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం ఇది. బుచ్చిబాబుకు కూడా మొదటి చిత్రమే. కొత్త టీమ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఉప్పెన భారీ కమర్షియల్ చిత్రాల రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు బీభత్సమైన లాభాలు పంచింది.

    ఆ మూవీ సక్సెస్ కృతి శెట్టిని ఓవర్ నైట్ స్టార్ చేసింది. ఆమెకు ఆఫర్స్ వరుస కట్టాయి. హీరోయిన్ గా రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఇక బంగార్రాజు మూవీతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. అరంగేట్రంతో హ్యాట్రిక్ ఇచ్చిన అతికొద్ది మంది హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరు. అయితే అక్కడి నుండి ఆమె ఫ్లేట్ తిరగబడింది.

    బంగార్రాజు అనంతరం కృతి శెట్టి నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు పరాజయం పొందాయి. నాగ చైతన్యతో రెండో సారి జతకట్టిన కస్టడీ కూడా నిరాశపరిచింది. నిజానికి ఈ మూవీ మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.

    కృతికి గతంలో మాదిరి ఆఫర్స్ రావడం లేదు. తెలుగులో ఆమె ఒకే ఒక చిత్రం చేస్తుంది. అది కూడా ఫార్మ్ లో లేని శర్వానంద్ కి జంటగా. తమిళ్ లో ఒక చిత్రం, మలయాళం లో మరొక చిత్రం చేస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. ఎలాగైనా మేకర్స్ ని ఆకర్షించాలని కృతి పడరాని పాట్లు పడుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. కృతి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.