ఎంత సూపర్ స్టార్ అయితే మాత్రం.. ?

ఎంత సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే మాత్రం, మాకేంటి అనే దోరణి ఉంటుంది తోటి పరిశ్రమల్లోని స్టార్ హీరోల్లో. ముఖ్యంగా విలన్ గా యాక్ట్ చెయ్యమంటే వారు చేస్తారా.. పైగా తన్నులు తినే క్యారెక్టర్ అంటే కాస్త ఇబ్బందే. ఒక భాషలో స్టార్ హీరోగా ఉంటూ.. ఇదేం దౌర్భాగ్యంరా బాబు.. విలన్ గా మేము చేయడం ఏమిటి అని అనుకుంటారు. ఇప్పుడు అలాగే అంటున్నాడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. […]

Written By: admin, Updated On : June 24, 2020 4:59 pm
Follow us on


ఎంత సూపర్ స్టార్ మహేశ్ బాబు అయితే మాత్రం, మాకేంటి అనే దోరణి ఉంటుంది తోటి పరిశ్రమల్లోని స్టార్ హీరోల్లో. ముఖ్యంగా విలన్ గా యాక్ట్ చెయ్యమంటే వారు చేస్తారా.. పైగా తన్నులు తినే క్యారెక్టర్ అంటే కాస్త ఇబ్బందే. ఒక భాషలో స్టార్ హీరోగా ఉంటూ.. ఇదేం దౌర్భాగ్యంరా బాబు.. విలన్ గా మేము చేయడం ఏమిటి అని అనుకుంటారు. ఇప్పుడు అలాగే అంటున్నాడు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర.

లాక్ డౌన్ విధించాలంటున్న నెటిజన్లు.. పట్టించుకోని సర్కార్

మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’లో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం ఆయనను సంప్రదించిందట. దాంతో ఉపేంద్ర నేను కూడా సూపర్ స్టార్ హీరోనే కదా, నన్ను విలన్ గా చేయమనడం ఏమిటి ? సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నా పాత్ర కీలకం.. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కాదు, అందుకే ఆ సినిమా చేశాను’ అని మహేష్ సినిమా చేయను అని ఉపేంద్ర చెప్పినట్లు తెలుస్తోంది.

నిజానికి ఉపేంద్ర చెప్పింది కూడా నిజమే కదా, కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతూ.. మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి ఆయకేం అవసరం. ఇక ఈ సినిమాలో ఓ సామాజిక అంశాన్ని ప్రదానంగా ప్రస్తావించబోతున్నారట. ఇక మహేష్ సరసన కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి గానీ, ఇంకా ఫైనల్ కాలేదు.

భారత – చైనా గొడవల్లో కమ్యూనిస్టులు ఎక్కడ?

అయితే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ లవ్ ట్రాక్‌ కూడా ఉందని, ఆ ట్రాక్ లో చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నారని.. అందుకే కీర్తి సురేష్ లాంటి టాలెంటెడ్ బ్యూటి అయితేనే బాగుంటుందని మేకర్స్ బావన. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ ప్రెస్టీజియస్ మూవీని భారీగా నిర్మిస్తున్నాయి.