Telugu Movies 2026 List: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు తెలుగు నుంచి ఏ సినిమా వచ్చినా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఇక 2026వ సంవత్సరంలో వరసగా భారీ సినిమాలు రావడమే కాకుండా ప్రేక్షకులకు ఎంటర్ టాన్ మెంట్ ను అందిస్తూనే ఇండస్ట్రీలో కలెక్షన్ల వర్షాన్ని కురిపించాలనే ప్రయత్నం చేస్తున్నాయి… మూవీ ప్రథమార్థంలో చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలు వాళ్ల సినిమాలతో సందడి చేస్తుంటే సెకండాఫ్ లో ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్ లాంటి నటులు ఇండస్ట్రీ హిట్ల ను సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు… ఇక 2026 ప్రథమార్థంలో కనక చూసుకున్నట్లయితే స్టార్ హీరోలు కొన్ని వేల కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ క్రమంలోనే వీళ్ళందరూ ఎలాంటి ఐడెంటిటిని సంపాదించుకుంటారు ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయగలుగుతారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ సినిమాలు కనక భారీగా వర్కౌట్ అయితే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తిరిగి ఉండదనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ వాళ్ళు సైతం మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘దురంధర్’ సినిమాకి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…
ఇక ఇలాంటి సందర్భంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మరో మెట్టు పైకి తీసుకెళ్లగలిగేది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అని గర్వంగా ప్రతి ఒక్కరు చెప్పుకునే రోజు రావాలంటే మాత్రం 2026వ సంవత్సరం కీలకంగా మారబోతోంది.
ఈ ఇయర్ లో వచ్చిన ప్రతి తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తే ప్రతి ఒక్కరి నోటి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీనే టాప్ ఇండస్ట్రీ అనే ఒక మాటలైతే వినిపిస్తూ ఉంటాయి. ఇక వాటిని వినడానికైన సరే నిర్మాతలు భారీ స్కేల్లో సినిమాలను చేసి మంచి విజయాలను సాధించాల్సిన అవసరమైతే ఉంది…