spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan-Upasana: హీరోయిన్స్ తో రామ్ చరణ్ అలా చేయడం ఉపాసనకు ఇష్టం లేదా.. అందుకే...

Ram Charan-Upasana: హీరోయిన్స్ తో రామ్ చరణ్ అలా చేయడం ఉపాసనకు ఇష్టం లేదా.. అందుకే అలా చేస్తోందా?

Ram Charan-Upasana: రామ్ చరణ్-ఉపాసన టాలీవుడ్ క్రేజీ కపుల్. ఇద్దరూ తమ రంగాల్లో రాణిస్తున్నారు. బిజినెస్ వుమెన్ గా ఉపాసన దూసుకుపోతుంది. పలు బాధ్యతలు నెరవేరుస్తుంది. ఇక రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. అమెరికా వేదికగా అనేక సత్కారాలు, గౌరవాలు అందుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్ లు చాలా బిజీ. క్షణం తీరికలేని ప్రొఫెషన్స్ లో ఉన్నారు. అయినప్పటికీ కొన్ని ముఖ్య వేడుకలు, ప్రత్యేకమైన దినాల కోసం సమయం కేటాయిస్తారు.

దాదాపు ఎక్కడికి వెళ్లినా జంటగా వెళతారు. కాగా రామ్ చరణ్ విషయంలో ఉపాసన చాలా పొసెసివ్ అనే టాక్ ఉంది. ఆయన తనకే సొంతం కావాలని కోరుకుంటుందట. సిల్వర్ స్క్రీన్ పై రామ్ చరణ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడాన్ని కూడా తట్టుకోలేదని, నొచ్చుకుంటుందని సమాచారం. ఈ పుకార్లను బలపరిచే విధంగా తాజా కామెంట్స్ ఉన్నాయి. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనను… ఏ హీరోయిన్ తో రామ్ చరణ్ కెమిస్ట్రీ బాగుంటుంది? అని యాంకర్ అడిగింది.

దానికి ఉపాసన… రామ్ చరణ్ తో బెస్ట్ కెమిస్ట్రీ అంటే అది నాతోనే అని చెప్పింది. కాదు హీరోయిన్ పేరు చెప్పాలి అంటే… నాకు తెలియదు. నేను ఆయన భార్యను, ఆ విషయం మీరు చెప్పాలి అని ఉపాసన అన్నారు. ఇక యాంకర్ కాజల్-రామ్ చరణ్ కెమిస్ట్రీ బాగుంటుందని, అన్నారు. దానికి ఉపాసన… కాజల్ అనే ఏముంది? అలియా భట్, కియారా, ప్రియాంక చోప్రా, సమంతలతో కూడా రామ్ చరణ్ కెమిస్ట్రీ బాగుంటుందని సమాధానం చెప్పింది.

ఉపాసన సమాధానం విన్న జనాలు రామ్ చరణ్ విషయంలో ఉపాసన చాలా పొసెసివ్ అంటున్నారు. చరణ్-ఉపాసనలది ప్రేమ వివాహం. 2012లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్ళైన 11 ఏళ్లకు 2023లో ఉపాసన తల్లి అయ్యారు. ఒక పాపకు జన్మనిచ్చారు. రామ్ చరణ్ కూతురు పేరు క్లింకార. మరోవైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నారు. అలాగే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానతో ఒక చిత్రానికి కమిట్ అయ్యారు. ఈ ఏడాది ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

RELATED ARTICLES

Most Popular