https://oktelugu.com/

Unstoppable With NBK: ఛార్మిని ఆటపట్టించిన బాలయ్య.. చూసి తీరాల్సిందే..!

Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. బాలకృష్ణ చేస్తున్న ఈ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలువురు సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు కొత్త బాలకృష్ణను పరిచయం చేస్తున్నాడు. ఈ సంక్రాంతి కోసం ‘ఆహా’ టీం స్పెషల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 11, 2022 / 02:50 PM IST
    Follow us on

    Unstoppable With NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షో చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. బాలకృష్ణ చేస్తున్న ఈ షోకు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ పలువురు సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులకు కొత్త బాలకృష్ణను పరిచయం చేస్తున్నాడు.

    ఈ సంక్రాంతి కోసం ‘ఆహా’ టీం స్పెషల్ కార్యక్రమాలను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి రోజున ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమానికి ‘లైగర్’ టీం గెస్ట్ గా రాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను ‘ఆహా’ తాజాగా విడుదల చేసింది. మూడు నిమిషాల 36సెకన్ల నిడివితో విడుదలైన ‘అన్ స్టాబుల్’ ప్రొమో వీక్షకులను ఎంతగానోఆకట్టుకుంటోంది.

    బాలకృష్ణ మార్క్ కామెడీ, వ్యాఖ్యానంతో ‘అన్ స్టాబుల్’ సంక్రాంతి ప్రోమో అదిరిపోయింది. ముందుగా బాలకృష్ణ ఎంటరై.. ‘మాటల గన్.. మన జగన్’ అంటూ పూరీ జగన్నాథ్ ను ఆహ్వానించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ మూవీ గురించి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే ఆ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ను బాలకృష్ణ గుర్తు చేస్తూ నవ్వులు పూయించారు.

    ఆ తర్వాత హీరోయిన్ ఛార్మి గురించి మాట్లాడుతూ.. ఆమెను తొలిసారి ‘అల్లరి పిడుగు’ సమయంలో కలిసానని.. ఇప్పుడు పిడుగులా అయ్యావంటూ ఛార్మిపై సైటర్ వేయడం నవ్వులు పూయించింది. ఆ తర్వాత ‘సమరసింహారెడ్డి వెల్ కమ్స్ అర్జున్ రెడ్డి’ అంటూ విజయ్ దేవరకొండను షోలోకి బాలయ్య ఆహ్వానించారు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్స్ పెక్టర్.. అసలు నువ్వు ఎలా రౌడీ అని ఫిక్స్ అయ్యావంటూ విజయ్ దేవరకొండని’ ప్రశ్నించాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్ ‘ఆహా’లో సంక్రాంతి రోజున స్ట్రీమింగ్ కానుంది.