Suryakantham: సూర్యకాంతం… ఈ పేరు తెలుగువాళ్ళకు నచ్చకుండా పోయింది. కానీ ఆ నటి మాత్రం తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సూర్యకాంతంగారు తూర్పు గోదావరి జిల్లా వెంకట కృష్ణరాయపురంలో జన్మించారు. సూర్యకాంతంగారు ఆమె తల్లితండ్రులకు 14వ సంతానం.. అందుకే ఆ ఇల్లు నిత్యం పిల్లలతో కోలాహలంగా ఉండేది. ఆ ఉత్సాహమే సూర్యకాంతంగారిలో కూడా కనిపించేది. దాంతో ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం ఆమె నేర్చుకున్నారు.
నాటకాలు వేసే సమయంలో ఆమె నటన చూసి జనం కొట్టిన చప్పట్లు ఆమెకు సినిమాల పై ఆసక్తిని పెంచింది. దీనికితోడు పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు ఆమెను బాగా ఆకర్షించాయి. ఎక్కడ పోస్టర్ కనబడినా ఆమె అలాగే చూస్తూ ఉండిపోయేవారు. అలా ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక పుట్టింది. కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేకపోయినా నటి కావాలని చెన్నై చేరుకొంది.
కానీ అవకాశాలు రాలేదు. గొప్ప నటి.. అయినా ఎందుకో ఆమె నటన చూసి ఎవరూ చలించలేదు. పైగా సినిమాల్లోకి నువ్వు పనికిరావమ్మా అంటూ నిరుత్సాహ పరిచారు. సూర్యకాంతంగారికి పట్టుదల ఎక్కువ. అందుకే అవకాశాలు వచ్చేవరకు ప్రయత్నాలు ఆపలేదు. అది జెమిని స్టూడియో.. ‘చంద్రలేఖ’ సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే నటి కోసం కాదు. డాన్సర్ కోసం. దాంతో సూర్యకాంతంగారు వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నారు.
ఆ సమయంలో మేనేజర్ భూషణం అనే వ్యక్తి ‘ఏవండీ’ అంటూ వెనుకే వచ్చి.. ‘డ్యాన్సర్ లు తక్కువ ఉన్నారండీ.. మీకు ఇష్టం అయితే.. డ్యాన్సర్ గా చేయండి’ అని చెప్పుకుంటూ పోయాడు. నాకు డ్యాన్స్ రాదయ్యా..? వాళ్లకు మట్టుకు వచ్చా అండి. చేయట్లేదా ఏమిటి ? అని నవ్వాడు. కట్ చేస్తే..సూర్యకాంతంగారు డ్యాన్సర్ గా తెలుగుతెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 1949 లో వచ్చిన ధర్మాంగద చిత్రంలో ఆమె మూగవేషంలో నటించింది .
ఆ సినిమాలో ఆమె నటన బాగుంది అన్నారు. దాంతో ‘నారద నారది’ సినిమాలో ఆమెకు సహాయ నటిగా అవకాశం వచ్చింది. అలా ఒక్కో సినిమా చేసుకుంటూ గృహప్రవేశం సినిమాలో నటించింది. ఐతే, సూర్యకాంతంగారికి స్టార్ డమ్ తెచ్చిన సినిమా ‘సంసారం’. ఈ చిత్రంలోనే ఆమె మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర పోషించింది. తెలుగు తెరకు గయ్యాళి అత్తగా శాశ్వతంగా నిలిచిపోయింది.
Also Read: Youtube vs Media : సెలబ్రెటీలపై రచ్చ: యూట్యూబ్ vs మీడియా చానెల్స్.. ఎవరు కరెక్ట్ ?
ఇక తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో ఎన్నటికి నిలిపోయేలా ఆమె జీవితాంతం అవే అత్త పాత్రలలో నటించి మెప్పించింది. అయితే చివరి దశలో వేషాలు తగ్గిపోయినా, చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేది. తన ఆరోగ్యం బాగులేకపోయినా, ‘నటిస్తాను’ అని ధైర్యంగా చెప్పేది. 1996న డిసెంబరు 17న రాత్రి సూర్యకాంతంగారు స్వర్గస్తులైనారు.
Also Read: Samantha: చైతుతో ఉన్న ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్…