Satyadev: ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు సైడ్ క్యారెక్టర్ గా దూసుకుపోతున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల మెగాస్టార్ తో కలిసి ‘గాడ్ ఫాదర్’లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 25న రిలీజ్ అయింది. ఇందులో సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆయన పడ్డ కష్టమంతా వృథా అయింది.. ఎందుకంటే..?

ఆధ్యాత్మిక కథలకు మంచి డిమాండ్ ఉండడంతో వాటిని బేస్ చేసుకొని సినిమాలు తీస్తున్నారు. ఇవి ఎక్కువగా బాలీవుడ్ నుంచే ఉంటున్నాయి. రామాయణం నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే రామాయణాన్ని లింక్ చేసే మరో మూవీ ‘రామ్ సేతు’ బుధవారం రిలీజ్ అయింది. ఇందులో అక్షయ్ కుమార్ ఆర్కియాలజిస్టుగా కనిపిస్తాడు. ఈయనకు సాయం చేసే వ్యక్తిగా ఏపీ పాత్రలో సత్యదేవ్ అలరించాడు. సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండడంతోనే ఆయనకు ఈ అవకాశం వచ్చింది.
‘రామ్ సేతు’లో సత్యదేవ్ నటన ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. మొదటిరోజూ నెగెటివ్ టాక్ రావడంతో సక్సెస్ అవకాశాలు తగ్గిపోయాయి. స్టోరీ బాగున్నా దానిని స్క్రీన్ ప్లే చేయడంలో విఫలమయ్యారంటూ రివ్యూలు వచ్చేశాయి. దీంతో ఈ సినిమా చాన్స్ కోల్పోయినట్లేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో కష్టపడి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సత్యదేవ్ కు ఈ సినిమా ప్లాప్ కావడంతో ఆయనకు గుర్తింపు రానట్లేనని అంటున్నారు. అయితే సత్యదేవ్ నటనకు మెచ్చిన కొందరు బాలీవుడ్ నుంచి మంచి అవకాశాలు ఇస్తారని అంటున్నారు. కానీ ముందు ముందు సత్యదేవ్ ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటాడో చూడాలి.

ఇటీవల బాలీవుడ్ మేకర్స్ సౌత్ నటులపై ఎక్కువగా దృష్టిపెట్టారు. ఇక్కడి వాళ్లకు అవకాశం ఇస్తే సౌత్ మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. దీంతో సత్యదేవ్ మంచి అవకాశాన్నే దక్కించుకున్నారు. కానీ మొదటి సినిమానే ప్లాప్ కావడంతో కాస్త నిరాశ చెందారు. కానీ ఆయన ప్రతిభలో మాత్రం ఎలాంటి లోటు రాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.