Kishkinda Kandam Movie : చిన్న బడ్జెట్ తో వినూత్నమైన చిత్రాలు మలయాళ పరిశ్రమలో రూపొందుతున్నాయి. మలయాళ చిత్రాలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ ఏడాది మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, ఆవేశం బాక్సాఫీస్ దుమ్ముదులిపాయి. ఇవన్నీ స్మాల్ బడ్జెట్ చిత్రాలే. ఈ కోవలోకి కిష్కింద కాండం కూడా వస్తుంది. పెట్టు బడికి పది రెట్లు వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. సెప్టెంబర్ 12న కిష్కింద కాండం విడుదలైంది. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది
కిష్కింద కాండం మూవీలో అసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ రాఘవన్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దినిజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. కిష్కింద కాండం మూవీ డిజిటల్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 19 నుండి ఈ చిత్రం స్ట్రీమ్ అవుతుంది.
కిష్కింద కాండం మూవీ కథ విషయానికి వస్తే.. హీరో మొదటి భార్య చనిపోతుంది. అతడు ఒక ఫారెస్ట్ ఆఫీసర్. తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. ఆయన వద్ద లైసెన్స్డ్ గన్ ఉంటుంది. అలాగే హీరో కొడుకు అడవిలో తప్పిపోతాడు. అతడి ఆచూకీ తెలియదు. కాగా రాష్ట్రంలో ఎన్నికలు నేపథ్యంలో లైసెన్స్డ్ గన్ ఉన్నవాళ్లందరూ పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేస్తారు.
హీరో తండ్రి గన్ మిస్ అవుతుంది. అది ఫారెస్ట్ ఏరియా కావడంతో తరచుగా ఇంట్లోని వస్తువులు కోతులు ఎత్తుకుపోతూ ఉంటాయి. గన్ కూడా అవే ఎత్తుకెళ్లాయని వెతికిస్తారు. అయినా దొరకదు. హీరో రెండో వివాహం చేసుకుంటాడు. గన్ మిస్సింగ్ వ్యవహారం అనేక ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. తప్పిపోయిన హీరో కొడుకు ఏమయ్యాడు? హీరో తండ్రి గన్ ఏమైంది? ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ..