Unexpected Surprise: ఈ నెల 12న పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) ని విడుదల చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు, ఓవర్సీస్ లో నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్ ని కూడా మొదలు పెడుతూ వచ్చారు. కానీ VFX కంటెంట్ చాలా వరకు డెలివరీ అవ్వాల్సి ఉండడం, అది సమయానికి డెలివరీ అవ్వకపోవడం తో చిత్రాన్ని వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని థియేట్రికల్ ట్రైలర్ తో పాటు ప్రకటిస్తామని నిన్న మేకర్స్ ఒక ప్రెస్ నోట్ ద్వారా అభిమానులకు తెలిపారు. ఇదంతా పక్కన పెడితే జూన్ 12 న ‘హరి హర వీరమల్లు’ సినిమా రావడం లేదు కానీ, జూన్ 14 న పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ‘తొలిప్రేమ'(Tholi Prema) చిత్రాన్ని మాత్రం విడుదల చేయబోతున్నారట.
Read Also: డ్రాగన్స్ తో దీపికా పదుకొనే ఫైట్..అల్లు అర్జున్,అట్లీ మూవీలో ఒళ్ళు గగురుపొడిచే సీన్స్!
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే వచ్చింది. పోనీలేండి, మా అభిమానుల ఆకలి తీరడానికి కనీసం ఈ చిత్రాన్ని అయినా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు, ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. తొలిప్రేమ చిత్రం 2022 వ సంవత్సరం లో ఒకసారి రీ రిలీజ్ చేశారు. కానీ అభిమానులు థర్డ్ పార్టీ రీ రిలీజ్ చిత్రాలను ప్రోత్సహించకూడదు, వాళ్ళు జనసేన పార్టీ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వరు అనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని ఎవ్వరూ థియేటర్స్ లో చూడరాదని అల్టిమేటం జారీ చేశారు. అభిమానులు పెద్దగా ఈ సినిమాని పట్టించుకోలేదు కానీ, మామూలు ఆడియన్స్ మాత్రం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి. ఇప్పుడు థియేటర్స్ లో సినిమాలు లేవు, ఖాళీగా ఉంటున్నాయి, ఈ కరువు కాలం లో తొలిప్రేమ ని విడుదల చేస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.
Read Also: అక్కినేని అఖిల్ పెళ్ళిలో సమంత హల్చల్..సంచలనంగా మారిన వీడియో!
1999 వ సంవత్సరం లో విడుదలైన తొలిప్రేమ చిత్రం తోనే పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్నాడు. అంతకు ముందు ఆయన కేవలం మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా మాత్రమే చలామణి అయ్యాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది తొలిప్రేమ సినిమా నుండే. ఆరోజుల్లోనే 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లాంటి పాపులర్ సెంటర్స్ లో ఏడాదికి పైగా ఈ చిత్రం ఆడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. అప్పట్లో ఈ చిత్రం ఎన్నో సార్లు రీ రిలీజ్ అయ్యింది. రీ రిలీజ్ అయిన ప్రతీసారి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. మళ్ళీ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.