ఆ ప్రాంతం లో ఈ సినిమాని దిల్ రాజు డబ్బులు అవసరం అయ్యినప్పుడల్లా రిలీజ్ చేసుకునేవాడు. అంత పెద్ద సెన్సేషన్ సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాని టీవీ లో వచ్చినప్పుడు చూస్తుంటే ఎంత గొప్ప సినిమా రా బాబు, పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఇంత ఫాలోయింగ్ రావడం లో ఆశ్చర్యమే లేదు అని అనిపిస్తాది. అలాంటి సినిమాని 4K కి మార్చి మన అభిమాన థియేటర్స్ లో నిన్న గ్రాండ్ గా విడుదల చేసారు.
వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వారాహి టూర్ మరియు మూడవ పార్టీ కి చెందిన సినిమా కావడం తో ఈ చిత్రాన్ని బ్యాన్ చేద్దాం అనుకున్నారు. సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో దీనిని బాయ్ కాట్ చెయ్యాలని ప్రచారం చేసారు కూడా. ఇంత నెగటివ్ పబ్లిసిటీ అయ్యింది కదా, ఈ సినిమాని ఎవ్వరూ చూడరేమో అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యమైన రీతిలో ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్ దక్కింది. దాదాపుగా అన్నీ ప్రాంతాలలో అత్యధికంగా ఉదయం 8 గంటల ఆటలని ప్రదర్శించారు.
మన రాష్ట్రము లో వర్కింగ్ డే రోజు కొత్త సినిమాలు ఆ సమయం లో హౌస్ ఫుల్ అవ్వడమే చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రానికి జనాలు నీరాజనం పలకడం చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెట్టారు. మొత్తం మీద ఈ చిత్రానికి మొదటి రోజు కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు కూడా ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలలో హౌస్ ఫుల్స్ పడే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.