Allu Arjun – Ram Charan : దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ కి ఉన్న ఇమేజ్ వేరు. ఆయన కెరీర్ బిగినింగ్ లో చేసిన చిత్రాలు చరిత్ర సృష్టించాయి. ఆయనతో మూవీ చేయడం స్టార్ హీరోల కలగా ఉండేది. ఇక శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో శంకర్ చెప్పిన ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’ పాయింట్ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యింది.
ఒకే ఒక్కడు మూవీ అనేక బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఒకే ఒక్కడు తర్వాత శంకర్ పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్స్ చేసింది లేదు. గేమ్ ఛేంజర్ శంకర్ నుండి దశాబ్దాల తర్వాత వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా. గేమ్ ఛేంజర్ చిత్రీకరణ మొదలై చాలా కాలం అవుతుంది. నిజానికి 2023లోనే గేమ్ ఛేంజర్ విడుదల కావాలి. అనుకోకుండా ఆగిపోయిన భారతీయుడు 2 చిత్రాన్ని శంకర్ పూర్తి చేయాల్సి వచ్చింది.
భారతీయుడు 2 చిత్రీకరణ మీద పూర్తి దృష్టి పెట్టిన శంకర్ గేమ్ ఛేంజర్ ని పాక్షికంగా పక్కన పెట్టాడు. ఈ కారణంగా గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుంది. కాగా గేమ్ ఛేంజర్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు తాజాగా విడుదల తేదీపై స్పందించారు. ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొన్నారు. రామ్ చరణ్ అభిమానులు గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ ఇవ్వాలని దిల్ రాజును డిమాండ్ చేశారు.
అభిమానుల కోసం దిల్ రాజు గేమ్ ఛేంజర్ విడుదలపై ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు. క్రిస్మస్ కి కలుద్దాం అన్నారు. ఇక్కడే పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. క్రిస్మస్ కి పుష్ప 2 విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కావాల్సింది. చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ కి వాయిదా వేశారు. క్రిస్మస్ బరిలో పుష్ప 2 దిగడం అనివార్యమే.
ఈ క్రమంలో గేమ్ ఛేంజర్-పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయా అనే సందేహాలు మొదలయ్యాయి. దిల్ రాజు చెప్పినట్లు గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కి విడుదలైతే ఇదే జరుగుతుంది. పుష్ప 2 మరలా వాయిదా వేసే పరిస్థితి లేదు. అయితే మరో కోణం కూడా ఇందులో ఉంది. పుష్ప 2 చిత్రీకరణ అంతకంతకు సుకుమార్ ఆలస్యం చేస్తుండగా అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడని. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో షూటింగ్ ఆపేసి విదేశాలకు వెళ్లిపోయారని. అందుకే అల్లు అర్జున్ గడ్డం ట్రిమ్ చేశాడు అంటూ… వరుస కథనాలు వెలువడ్డాయి.
మరి ఇదే నిజమైతే పుష్ప 2 డిసెంబర్ కి కూడా రాకపోవచ్చు. అందుకే దిల్ రాజు పుష్ప 2 డేట్ ని గేమ్ ఛేంజర్ కి వాడుకోవాలని అనుకుంటున్నాడేమో అనే సందేహం కూడా కలుగుతుంది. అలాగే క్రిస్మస్ కి కలుద్దాం అంటే.. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్రిస్మస్ కి జరిపి… మూవీ సంక్రాంతి బరిలో దింపుతాడేమో అనే మరో కోణం కూడా వినిపిస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Web Title: Two star heroes who are preparing to big hit in box office
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com