
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమురంభీంగా నటిస్తున్నాడు. ప్యాన్ వరల్డ్ లెవల్లో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సైట్స్ పై ఉండగానే ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు.
Also Read: మరో బాంబ్ పేల్చిన వర్మ.. ఈసారి ఏం చేస్తాడో?
కరోనా ఎఫెక్ట్.. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ ఆలస్యం కారణంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. అయినప్పటికీ ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. గతంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో ‘అరవింద సమేత’ మూవీ రిలీజై సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించింది.
తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీకి ‘అయినను హస్తినకు పోయిరావలే’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. టైటిల్ తోనే ఈ సినిమా అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన నటించడంతో ఈ మూవీలో మరో హీరోయిన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.
Also Read: బికినీలో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తున్న రకుల్
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో ఇద్దరు హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ఈ భామ మహేష్.. రాంచరణ్ సరసన నటించింది. కియారాను తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని సమాచారం. ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకుంటే రష్మిక మందన్నను ఖరారు చేయాలని దర్శకుడు ఫిక్స్ అయినట్లుగా గుసగుసలు విన్పిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్