https://oktelugu.com/

ట్విట్టర్ హీరోలు వీరే!

ఇప్పుడు హవా సోషల్ మీడియాదే. ఇందులోనూ.. ట్విట్టర్ లెక్క అలగ్. ఇక్కడ ఎంత ట్రెండ్ అయితే.. ఆ పోస్టుకు, అది రాసిన ఓనర్ కు అంత క్రేజ్ ఉన్నట్టు లెక్క. ఈ లెక్కలను పక్కాగా లెక్కగట్టి.. 2020లో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఎక్కువగా డిస్కషన్ లోకి వచ్చిన సినిమాలేంటి? అనే వివరాలను రిలీజ్ చేసింది ట్విట్టర్. మరి, ఆ ట్విట్టర్ వీరులెవరో మీరు ఓ లుక్కేయండి. Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 14, 2020 / 07:21 PM IST
    Follow us on


    ఇప్పుడు హవా సోషల్ మీడియాదే. ఇందులోనూ.. ట్విట్టర్ లెక్క అలగ్. ఇక్కడ ఎంత ట్రెండ్ అయితే.. ఆ పోస్టుకు, అది రాసిన ఓనర్ కు అంత క్రేజ్ ఉన్నట్టు లెక్క. ఈ లెక్కలను పక్కాగా లెక్కగట్టి.. 2020లో ఎక్కువగా ట్రెండ్ అయిన హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఎక్కువగా డిస్కషన్ లోకి వచ్చిన సినిమాలేంటి? అనే వివరాలను రిలీజ్ చేసింది ట్విట్టర్. మరి, ఆ ట్విట్టర్ వీరులెవరో మీరు ఓ లుక్కేయండి.

    Also Read: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సరికొత్త రికార్డ్ !

    నెంబర్ వన్ “అతడు”
    ఈ ఏడాది ట్విట్టర్ లో ఎక్కువగా మాట్లాడుకున్న హీరోల జాబితాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నాడు. ట్విట్టర్ లో ఎక్కువగా ఈ మిల్కీ బాయ్ గురించే మాట్లాడుకున్నారట. ఆ తర్వాత రెండో ప్లేస్ లో ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మూడో స్థానంలో తమిళ నటుడు విజయ్ నిలిచాడు. ఈ ముగ్గురు నటుల హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువగా ట్రెండ్ అయ్యాయని ట్విట్టర్ ప్రకటించింది.

    హీరోయిన్ “మహానటి”..
    ఇక 2020లో ఎక్కువగా ట్వీట్లు పొందిన హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచింది కీర్తిసురేష్. ఈమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, సినిమాల గురించి ఎక్కువ ట్వీట్లు పడ్డాయి. అంతేకాదు.. ట్విట్టర్ లో ఎక్కువమంది ప్రశ్నించింది కూడా కీర్తిసురేష్ నే. ఈ లిస్ట్ లో రెండో స్థానంలో కాజల్, మూడో స్థానంలో సమంత నిలిచారు.

    Also Read: పోటీకి రెడీ: రాజకీయాల్లోకి స్టార్ హీరో

    సినిమాలు ఇవే..
    ఇక సినిమాల విషయానికొస్తే.. ట్విట్టర్ జనాలు ఇంకా రిలీజ్ కాని మాస్టర్, వకీల్ సాబ్ సినిమాల గురించి ఎక్కువగా డిస్కస్ చేశారట. చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకోవడంతో పాటు లాక్ డౌన్ కారణంగా మధ్యలో బ్రేక్ రావడంతో.. ఎక్కువగా ట్విట్టర్ లో ఈ రెండు సినిమాల హ్యాష్ ట్యాగ్స్ పాపులర్ అయ్యాయి. ఇక మూడో స్థానంలో వళిమై, నాలుగో స్థానంలో సర్కారువారి పాట సినిమాలు నిలిచాయి.

    టాప్ 5 హీరోలు..
    1. మహేష్ బాబు
    2. పవన్ కల్యాణ్
    3. విజయ్
    4. ఎన్టీఆర్
    5. సూర్య

    టాప్ 5 హీరోయిన్లు..
    1. కీర్తిసురేష్
    2. కాజల్ అగర్వాల్
    3. సమంత
    4. రష్మిక
    5. పూజా హెగ్డే

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    టాప్ 5 మూవీస్..
    1. మాస్టర్
    2. వకీల్ సాబ్
    3. వళిమై
    4. సర్కారువారిపాట
    5. సురారై పొట్రు