
TV Serial Actresses: సీరియల్ నటీమణులు అంటే.. సెకండ్ గ్రేడ్ యాక్టర్స్ అనే ఆలొచన చాలా మందిలో ఉంటుంది. అయితే.. అది ఒకప్పటి మాటేమోగానీ.. ఇప్పుడు మాత్రం కాదనే చెప్పాలి. సినిమా నటులకు ఏమాత్రం తగ్గకుండా అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు చాలా మంది. కొందరు ఫ్యాన్ బేస్ విషయంలోనూ పోటీగా నిలుస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి, అలాంటివారు ఎవరన్నది చూద్దాం.
ప్రేమీ విశ్వనాథ్: ఇప్పుడు.. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని ప్రేక్షకులు లేరు. సాయంత్రం 7.30 ఆయ్యిందంటే.. టీవీ ముందు కూర్చోవాల్సిందే. అప్పటి వరకూ చానల్ ఏదున్నా.. ఆ క్షణంలో మారిపోవాల్సిందే. ఆ సీరియల్ లో నటించే వారిలో వంటలక్క కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఊహించలేరు. అయితే.. ఆ సీరియల్ లో డీ గ్లామరస్ రోల్ లో యాక్ట్ చేస్తున్న వంటలక్క అలియాస్ ప్రేమీ విష్వనాథ్ ను బయట చూశారంటే మైండ్ బ్లోయింగే. సినిమా హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది.
సమీరా: బుల్లి తెరపై యాంకర్ గా, నటిగా సత్తా చాటుతోంది సమీరా. సీరియల్స్, డ్యాన్స్ షోల ద్వారా తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన సమీరా.. మంచి ఫిజిక్ తో.. హీరోయిన్ ను తలపిస్తుంది. అవకాశం వస్తే మాత్రం వెండితెరపైనా సత్తా చాటే సోయగం ఈ అమ్మడి సొంతమనే చెప్పలి.
నవ్య స్వామి: నాపేరు మీనాక్షి సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన నటి నవ్య స్వామి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్య.. కన్నడనాట ప్రసారమైన ‘తంగళి’ సీరియల్ తో ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత తమిళ్ సీరియల్ ‘వాణీ రాణీ’తో అరవ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగులోకి ప్రవేశించింది. అయితే.. సీరియల్స్ లో సాంప్రదాబద్ధంగా కనిపించే నవ్య.. మోడ్రన్ డ్రెస్స్ వేసిందంటే.. రచ్చ రచ్చే. హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో మత్తెక్కించే ఈ బ్యూటీ.. సినీ హీరోయిన్లను మరిపిస్తుంది.
కరుణ: ప్రస్తుతం సీరియల్స్ లో సత్తా చాటుతున్న కరుణ.. ఒకటీ రెండు సినిమాల్లోనూ నటించింది. ఆకర్షించే అందంతో మెస్మరైజ్ చేసే ఈ బ్యూటీ కూడా హీరోయిన్ కు తీసిపోదు.
ప్రియాంక నల్కర్ : స్టార్ అయ్యే లక్షణాలుండి.. టీవీకి పరిమితం అయిన బ్యూటీ ప్రియాంక నల్కర్. సీరియల్స్ లోనూ భారీ హిట్స్ ఏమీ రాలేదు. కానీ.. ఈ అమ్మడి అందం, హాట్ ఫొటోలు హీరోయిన్లను తలపిస్తాయి. రెగ్యులర్ ఫొటోషూట్లతో ఇటు ఫేస్‌బుక్, అటు ఇన్‌స్టాగ్రామ్‌లో క్రేజ్ పెంచుకుంటూ ఉంది. ఈ విధంగా సినిమా తారలకన్నా తగ్గేదే లే అనేట్టుగా అందం, అభినం ఉన్నా.. బుల్లితెర దాటలేకపోతున్నారు ఈ భామలు.