Site icon OkTelugu

Venkatesh Trivikram Film: వెంకటేష్ తో యాక్షన్ మూవీ చేస్తున్న త్రివిక్రమ్… వర్కౌట్ అవుతుందా…

Venkatesh Trivikram Film

Venkatesh Trivikram Film

Venkatesh Trivikram Film: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ సైతం ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాల వైపే అడుగులు వేస్తున్నాడు. వెంకటేష్ ను హీరోగా పెట్టి ఆయన చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటూనే ఇది ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వెంకటేష్ ఈ సినిమాలో గన్ను పట్టుకుని యుద్ధం చేస్తారట. ఆయన ఎవరితో చేస్తాడు… ఎందుకు చేస్తాడు అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… నిజానికి త్రివిక్రమ్ గతంలో అన్ని ఫ్యామిలీ సినిమాలనే చేస్తాడు అంటు ప్రేక్షకులు సైతం విసిగిపోయి అతను కొత్త తరహా సినిమాలు చేస్తే చూడాలని చాలావరకు విమర్శలైతే చేశారు. కానీ త్రివిక్రమ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా మరోసారి ఫ్యామిలీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట సాధించబోయే విజయాలు ఏ మేరకు సక్సెస్ ని సాధించి పెడతాయనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి కొంతమంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. అలాంటి దర్శకులు ఇప్పుడు పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతున్నారు.

త్రివిక్రమ్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడానికి తీవ్రమైన సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన సినిమాలు తెలుగుకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఇకమీదట త్రివిక్రమ్ ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇప్పటివరకు త్రివిక్రమ్ తో సినిమాలు చేసిన ప్రతి హీరో స్టార్ హీరోగా మారిపోయారు. తను ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి పెద్దగా ప్రేక్షకులు మెప్పించకపోవడంతో తను మరోసారి తన ఫామ్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉందని అతని అభిమానులు కోరుకుంటున్నారు…

Exit mobile version