Santhoshi Srikar: వాటిలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా సూపర్ హిట్ అయింది. సిద్ధార్థ, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఈ సినిమాలో శ్రీహరి ఇంట్లో పని మనిషిగా సంతోషి శ్రీకర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు గాను ఆమె బెస్ట్ ఫిమేల్ కమీడియన్ క్యాటగిరీలో నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది. పెళ్లి చేసుకొని చాలామంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తమ పూర్తి సమయాన్ని తమ కుటుంబంతోనే గడుపుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసి మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఒకప్పటి హీరోయిన్లు కొంతమంది వ్యాపారాలలో సత్తా చాటుతో బిజీగా ఉన్నారు. నటి సంతోషి శ్రీకర్ కూడా ఈ జాబితాకు చెందిందే.
ఈమె హీరో నవదీప్ కు జోడిగా జై అనే సినిమాలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రేమ కథా చిత్రం గా తేజ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సంతోషి శ్రీకర్ అనే ముస్లిం అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించి తన నటనతో అప్పట్లో యువత మనసులో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత సంతోషి శ్రీకర్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే సినిమాలో సహాయనిటీగా కనిపించింది. శ్రీహరి, త్రిష ఇంట్లో సంతోషి శ్రీకర్ పనిచేసే అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సినిమాలో సంతోషి శ్రీకర్ పనిమనిషి పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎవరైనా ఆమెను జాగ్రత్త అంటే చాలు కంగారుపడి చేతిలోని వస్తువులను కింద పడేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమాలో ఆమె డైలాగులు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈమె తమిళ సినీ నటి పూర్ణిమ కూతురు.
కానీ ఈ విషయం చాలామందికి తెలియదు అని చెప్పాలి. అలాగే సీనియర్ నటుడు ప్రసాద్ బాబు కోడలు సంతోషిని శ్రీకర్. ఈమె తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడే, బంగారం, డి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు ఎక్కువగా సినిమాలలో సహాయక పాత్రలు మాత్రమే రావడంతో ఈమె అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. తమిళ్లో హీరోయిన్ గా రెండు మూడు సినిమాలలో కనిపించినా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. సంతోషిని పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈమె బోటిక్ అండ్ బ్యూటీ లాంగ్ పేరుతో వ్యాపారం నడుపుతుంది. ఈమె బోటిక్ స్ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్ వంటి తదితర నగరాలలో కూడా ఉన్నాయి.