
సినిమా కాన్సెప్ట్ లు రెగ్యులర్ గా ఉంటే, జనం ఇంట్రస్ట్ చూపించడం లేదు. అందుకే మేకర్స్ కూడా తమ పరిధులు దాటేసి.. కొత్త రకం బోల్డ్ కాన్సెప్ట్ లతో సినిమాలు తీస్తున్నారు. తాజాగా వచ్చిన ఓ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. సినిమా టైటిల్ వచ్చేసి ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. టైటిల్ లోనే సినిమా సారాంశం ఉంది కాబట్టి.. దీని గురించి అనవసరమైన ఉపోద్ఘాతం అనవసరం. అయితే ఈ కాన్సెప్ట్ పై మహిళా లోకం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇంతకీ సినిమా విషయానికి వస్తే.. విశ్వంత్, మాళవిక జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతుంది ఈ సినిమా. పక్కా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ ను మరో యంగ్ బోల్డ్ హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఈ బోల్డ్ హీరో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేసి.. సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ఇంత బోల్డ్ సినిమాకి పెట్టుబడి ఎవరయ్యా పెడుతుంది అంటే.. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ వారు. ఈ బ్యానర్స్ పై వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ అత్యంత వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టారు. మరి వీరు నిర్మిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది.
అన్నట్టు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న ఆ బోల్డ్ దర్శకుడి పేరు సంతోష్ కంభంపాటి. సినిమా టైటిల్ లోనే తానేంటో చూపించాడు ఈ దర్శక యువ రక్తం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఏది ఏమైనా ఈ చిత్రం తాలుకా టీజర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అమ్మాయిలు ఒక అబ్బాయిని డే పూట కూడా వదలకుండా బుక్ చేసుకోవడం, ఇతగాడు కూడా ఓపెన్ గా నా రేటు చాల ఎక్కువ అంటూ సగర్వంగా చాటి చెప్పుకోవడం లాంటివి టీజర్ లో పేలిన ఆణిముత్యాలు. మరి టీజర్ పై మీరు కూడా ఒక లుక్ వేయండి.