game changer : ఒకప్పుడు మన టాలీవుడ్ కి వంద కోట్ల రూపాయిల సినిమా వచ్చిందంటే చాలు, ఎదో పెద్ద ఘనత సాధించినట్టు ఉండేది. కానీ ఇప్పుడు ఆ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం మొదటి రోజు రాబట్టడమే మన టాలీవుడ్ స్టార్ హీరోలకు అలవాటు గా మారింది. ఇప్పటి వరకు ప్రభాస్ కి అత్యదిక వంద కోట్ల గ్రాస్ సినిమాని మొదటి రోజు రాబట్టినవి ఉన్నవి. ఆ తర్వాత ఈ లిస్ట్ లోకి దేవర తో జూనియర్ ఎన్టీఆర్ చేరాడు. గత ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ తో , ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా లిస్ట్ లోకి వచ్చేసారు. అయితే ట్రేడ్ పండితులు అందించిన లెక్కలు కాకుండా, నిర్మాతలు అధికారికంగా ప్రకటించిన వసూళ్లను పరిగణలోకి తీసుకొని టాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లను సాధించిన టాప్ 5 చిత్రాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
పుష్ప 2 :
గత ఏడాది భారీ అంచనాల నడుమ డిసెంబర్ నెలలో విడుదలైన ఈ చిత్రం మొదటి ఏకంగా #RRR రికార్డు ని కొల్లగొట్టి, 294 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాకుండా, బాలీవుడ్ లో కూడా ఈ సినిమానే ప్రస్తుతానికి ఓపెనింగ్స్ లో నెంబర్ 1 అని చెప్పొచ్చు.
#RRR :
ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం రెండేళ్ల క్రితం ఎలాంటి సంచలనాలకు తెర లేపిందో మనమంతా కళ్లారా చూసాము. టాలీవుడ్ నుండి హాలీవుడ్ లెవెల్ కి వెళ్లిన ఈ చిత్రం ఆస్కార్ అవార్డుని కూడా గెలుచుకుంది. ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 223 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
బాహుబలి 2 :
సుమారుగా 7 క్రితం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సునామీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదటి ఆరోజు అప్పట్లోనే ఈ చిత్రం 210 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ హీరోలు ఈ రికార్డు ని దాటొచ్చు గాక, కానీ మొదటి రోజు ఈ సినిమాకి అమ్ముడుపోయిన టికెట్స్ కౌంట్ రికార్డు ని మాత్రం అందుకోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కల్కి :
గత ఏడాది ప్రభాస్, అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్, దీపికా పడుకొనే కాంబినేషన్ నాగ అశ్విన్ దర్శకత్వం లో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఫుల్ రన్ లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభాస్ కెరీర్ లో రెండవ వెయ్యి కోట్ల సినిమాగా నిల్చింది.
గేమ్ చేంజర్ :
నిన్ననే ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ టాక్ ప్రభావం వసూళ్ల పై చాలా భారీగా పడుతుందని అందరూ అనుకున్నారు కానీ, నిర్మాతలు అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 186 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన సలార్ చిత్రం 178 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతో ఆరవ స్థానం, అదే విధంగా ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 172 కోట్లతో 7 వ స్థానం లో ఉన్నాయి. ఇవన్నీ కేవలం నిర్మాతలు అందించిన లెక్కలు మాత్రమే. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం వేరే ఉండొచ్చు.