Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ..ఈయన చేసిన కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించినప్పటికీ ప్రస్తుతం ఆయనకి కొన్ని ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఇక దాంతో పాటుగా రవికిరణ్ డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక వీళ్లిద్దరితో పాటు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ఒక పిరియాడికల్ డ్రామా సినిమాని చేయబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మిక మందాన కాంబినేషన్ లో వచ్చిన ‘గీతగోవిందం ‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అప్పటినుంచి వీళ్ళ కాంబినేషన్ మీద అంచనాలైతే భారీగా పెరిగి పోయాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా రష్మికా మందాన ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం లో రాహుల్ సంకృత్యాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ ప్రస్తుతం తను ఉన్న బిజీ వల్ల ఈ సినిమా చేస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ రష్మిక మందాన కాంబో ని మరోసారి కలపడానికి రాహుల్ విపరీతమైన ప్రయత్నాలైతే చేస్తున్నాడు. మరి విజయ్ కోసం తను మళ్లీ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం విజయ్ కోసం రష్మిక ఈ సినిమాలో తప్పకుండా నటిస్తుంది అంటూ సోషల్ మీడియా లో కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
నిజానికి విజయ్ దేవరకొండ రష్మిక మందానికి మధ్య మంచి అండర్ స్టాండింగ్ అయితే ఉంది. వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు. ఎప్పుడైతే గీత గోవిందం సినిమా వచ్చిందో అప్పటినుంచి వీళ్ళ కాంబోకి మంచి క్రేజ్ పెరగడమే కాకుండా వీళ్ళ మధ్య కూడా మంచి సన్నిహిత్యమైతే ఉంది. ఇక ఆ సన్నిహిత్యం వల్ల రష్మిక ఈ సినిమా లో నటిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…