Chiranjeevi Star Director mistake: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు గొప్ప విజయాలను సాధించాయి. నిజానికి ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి తనదైన రీతిలో సత్తా చాటుకోవడం అంటే మామూలు విషయం కాదు. స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ నెంబర్ వన్ పొజిషన్ ని కైవసం చేసుకున్నాడు. అలాంటి చిరంజీవి తను చేసే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ఒక సినిమా సక్సెస్ ని సాధించాలి అంటే అందులో ఏ ఏ ఎలిమెంట్స్ ఉండాలి అనేది చిరంజీవికి బాగా తెలుసు…ప్రేక్షకులు మెచ్చే ఎలిమెంట్స్ ఏంటి? ప్రేక్షకులు రిజెక్ట్ చేసే సీన్స్ ఏంటి అనేది అతనికి తెలిసినంత గొప్పగా ఇంకేవరికి తెలియదనే చెప్పాలి. అలాంటి చిరంజీవి విషయంలో ఒక స్టార్ డైరెక్టర్ చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ చేశాడు. ‘చూడాలని ఉంది’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన చిరంజీవి ఆ మూవీతో మంచి గుర్తింపైతే వచ్చింది.
ఇక వీళ్ళ కాంబినేషన్లో ‘మృగరాజు’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్డ్ గా రాసుకున్నప్పటికి ఆ సినిమా విషయంలో మాత్రం చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ జరిగిందని రీసెంట్ గా గుణశేఖర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేశాడు. మృగరాజు సినిమాలో సింహం విలన్ కావడం అనేది చాలా మందికి నచ్చలేదు.
సెపరేట్ విలన్ ఉంటే బాగుండేది. అలా అయితే సినిమాకి ఎక్కువగా రీచ్ వచ్చేదని, ఫైనల్ గా సినిమా సూపర్ సక్సెస్ అయి ఉండేదని ఆయన చెప్పాడు. మొత్తానికైతే చిరంజీవి విషయంలో గుణ శేఖర్ ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేశాడని తనే ఒప్పుకున్నాడు.
ఇక వీళ్ళ కాంబోలో ఆ తర్వాత మరో సినిమా అయితే రాలేదు… ఇక మీద వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే గుణశేఖర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఆయన వరుస సినిమాలు చేస్తున్నప్పటికి వచ్చిన సినిమాలు వచ్చినట్టు ప్లాప్ అవుతున్నాయి. ఏదైనా సాలిడ్ హిట్టు కొడితే మాత్రం చిరంజీవి తో సినిమా చేసే ఛాన్స్ రావచ్చు…