Sai Pallavi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవి అప్పటి నుంచి ఇప్పటివరకు వెను తిరుగు చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తుంది. ఇక నిజానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ తెలుగు లో ఉండటం మన అదృష్టం అనే చెప్పాలి. ఇక ఆమె ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ లో నటించదు.ఆమెకి నచ్చిన క్యారెక్టర్ సినిమాలో ఉండి, ఆ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే ఆమె ఆ సినిమాలో నటిస్తుంది. అంతేతప్ప డబ్బుల కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేసే టైప్ తను కాదనే విషయం ఆమె చేసిన సినిమాలు చూస్తేనే మనకు అర్థమవుతుంది.
ఇక ఇప్పుడు ఈమె నాగచైతన్య హీరోగా చండ్ద్ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న తండేల్ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తెరకెక్కబోతున్న రామాయణం సినిమాలో కూడా సీత పాత్రలో నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించగా, కేజీఎఫ్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న యశ్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర లో నటించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు నితేశ్ తివారీ డైరెక్షన్ చేయబోతున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఒక స్టార్ హీరోయిన్ ఒక సినిమా కోసం 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న రోజులు ఉన్నాయి.కానీ ప్రస్తుతం సాయి పల్లవి భారీ మొత్తం లో రెమ్యునరేషన్ తీసుకుంతుందని తెలుస్తుంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఈ సినిమా కోసం 50 కోట్ల రెమ్యూనరేషన్ ను తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
మరి ఈ ఒక్క సినిమాలో నటించడానికీ ఆమె అంత డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమాకోసం ఆమె ఎక్కువ రోజులు కేటాయించాల్సి ఉంటుంది.అందుకే ఆమె డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రొడ్యూసర్లు ఈ సినిమా కోసం ఆమెకి అంతలా డబ్బులు వెచ్చించడానికి గల కారణమేంటి అంటే సాయి పల్లవి అంటే డీసెంట్ పాత్రలను పోషిస్తుంది. అనే పేరు అయితే ఉంది. ఇక ఆమె మాత్రమే సీత అంటే ప్రతి ఒక్క ఆడియన్ కూడా చాలా ఈజీగా నమ్ముతాడు. అలాగే ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని 50 కోట్లు అయిన సరే ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు వెనకాడడం లేదు.