Family Star: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు. ఇక అందులో భాగంగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన పరుశురామ్ తో విజయ్ చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమా ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అంటే పరుశురాం తన గత సినిమాల మాదిరిగానే ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇక ముఖ్యంగా ఈ కథ 1990 లా నాటి కథలను పోలి ఉండటం. దానికి స్క్రీన్ ప్లే ని కూడా అంత ఎఫెక్ట్ గా సమకూర్చకపోవడం తో చాలా సన్నివేశాలు బోరింగ్ గా ఉండడం. వీటన్నింటి వల్ల ఈ సినిమాని ప్రేక్షకుడు రిసీవ్ చేసుకోలేకపోయాడు. అందువల్లే ఈ సినిమా కి నెగిటివ్ టాక్ వచ్చింది.
ఇక ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేకపోవడం కూడా దీనికి కొంతవరకు మైనస్ గా మారిందనే చెప్పాలి. పరుశురాం అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలని సక్సెస్ ఫుల్ గా తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు అయినప్పటికీ ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ స్థాయిలో ఉండడం హై నిచ్చే సీన్ ఒక్కటి కూడా లేకపోవడం. ఈ సినిమా మీద నెగిటివ్ ఫీల్ రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు…
ఇక మొత్తానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. ఇకమీదట అయిన విజయ్ తను చేసే సినిమాల కంటెంట్ విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా బెటర్ గా ఉంటుందని సినీ విమర్శకులు సైతం ఆయనకి సలహాలను ఇస్తున్నారు…